logo

ఎమ్మెల్సీగా జయమంగళ

మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ అనూహ్య పరిణామాల మధ్య ఎమ్మెల్సీగా గెలుపొందారు.

Published : 24 Mar 2023 04:51 IST

మండవల్లి, కైకలూరు, న్యూస్‌టుడే: మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ అనూహ్య పరిణామాల మధ్య ఎమ్మెల్సీగా గెలుపొందారు. గురువారం జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైకాపా నుంచి బరిలో దిగిన  కోలా గురువులు, జయమంగళకు సమాన ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించడంతో విజయం జయమంగళను వరించింది. దీంతో కైకలూరు నియోజకవర్గం వ్యాప్తంగా ఆయన అభిమానులు సంబరాలు నిర్వహించారు.

కొల్లేరు అభివృద్ధికి కృషి చేస్తా:  కొల్లేరు ప్రాంత అభివృద్ధికి కృషి చేసి ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు పాటు పడతానని జయమంగళ పేర్కొన్నారు. ‘న్యూస్‌టుడే’తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. రాజకీయంగా తాను ఇంతటి స్థాయికి రావడానికి వెన్నంటే నిలిచిన కొల్లేరు ప్రాంత ప్రజానీకానికి రుణపడి ఉంటానన్నారు. పింఛనుతో పాటు గతంలో మాదిరిగా రాయితీపై వెదురు కర్రలు, తాటిదోనెలు, వలలు అందించేలా సీఎం జగన్‌తో చర్చించి మత్స్యకారులకు అండగా ఉంటానన్నారు. సరస్సులో జీరో పాయింట్‌ చేపల పెంపకం చేసుకుని స్థానిక మత్స్యకారులు సంప్రదాయ వేటను కొనసాగించుకుని జీవనం సాగించేలా కృషి చేస్తానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని