logo

తొలి రోజు నిరాశే!

పొగాకు వేలం ప్రారంభమైన తొలిరోజే ధర విషయంలో రైతులకు నిరాశే ఎదురైంది. జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రాల్లో గురువారం ఉదయం వేలం ప్రారంభమైంది. 27, 99 బేళ్లు చొప్పున ఉంచగా..

Published : 24 Mar 2023 04:51 IST

పొగాకు కొనుగోళ్లు ప్రారంభం

వేలంలో పాల్గొన్న అధికారులు, కొనుగోలుదారులు

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: పొగాకు వేలం ప్రారంభమైన తొలిరోజే ధర విషయంలో రైతులకు నిరాశే ఎదురైంది. జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రాల్లో గురువారం ఉదయం వేలం ప్రారంభమైంది. 27, 99 బేళ్లు చొప్పున ఉంచగా.. కేజీ రూ.210 అత్యధిక ధరకు కంపెనీలు కొనుగోలు చేశాయి. అధికారులు శ్రీహరి, సురేంద్ర వేలం నిర్వహించారు. ఏడు కంపెనీలకు చెందిన కొనుగోలు దారులు పాల్గొన్నారు. గరిష్ఠ ధర రూ.225గా వేలం ప్రారంభించగా.. కంపెనీలు రూ.210 చొప్పున కొనుగోలు చేశాయని అధికారులు తెలిపారు. రైతు నాయకులు కరాటం వెంకటరెడ్డినాయుడు, యంట్రప్రగడ శ్రీనివాసరావు, గద్దె లక్ష్మణరావు, అట్లూరి సతీష్‌, గాంధీ, సత్రం వెంకట్రావు, బిక్కిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సగటు ధర రూ.230 తగ్గకూడదు

అనేక ఒడుదొడుకుల మధ్య నాణ్యమైన పొగాకు పండించాం. సగటు ధర కేజీకి రూ.230 తగ్గకుండా కొనుగోలు చేయాలి. కూలి, ఎరువులు, అన్ని రకాల ధరలు బాగా పెరిగాయి. అత్యధిక ధర రూ.245 వరకు, సగటు రూ.230 చొప్పున ఇచ్చేలా వ్యాపారులు, పొగాకు బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలి. గురువారం ఇచ్చిన రూ.210 ధరతో మేము సంతృప్తిగా లేం. మొదటి రోజు కావడంతో తిరస్కరించలేదు’ అని ఒకటో కేంద్రం రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పరిమి రాంబాబు, హరిబాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని