logo

సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాదే విజయం: తోట

శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు.

Published : 24 Mar 2023 04:51 IST

ఏలూరులో బడేటి తదితరుల సంబరాలు..

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. రానున్న రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థ సారథి ఒక ప్రకటనలో తెలిపారు. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనురాధ విజయమే దానికి సంకేతమని పేర్కొన్నారు. ఏలూరులో పార్టీ శ్రేణులు విజయోత్సవం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి బడేటి చంటి విడిది కార్యాలయం వద్ద కేకు కోసి పంచారు. ఉండి, ఆకివీడు, తణుకుతోపాటు పలు చోట్ల నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని