logo

కల్యాణం.. కమనీయం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా  వాడవాడలా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణం కనుల పండువగా జరిపించారు.

Updated : 31 Mar 2023 05:51 IST

మద్ది ఆలయంలో..

జంగారెడ్డిగూడెం పట్టణం,  కామవరపుకోట, పెంటపాడు, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా  వాడవాడలా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణం కనుల పండువగా జరిపించారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి క్షేత్రంలో సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తిలకించారు. ఈవో ఆకుల కొండలరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

* ద్వారకాతిరుమల చినవేెంకన్న ఉపాలయం తూర్పు యడవల్లి సీతారామ చంద్రస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. ద్వారకాతిరుమల ఆలయాధికారులు, తూర్పుయడవల్లి సర్పంచి పొన్నాల అనిత ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు అన్నదానం చేశారు.


తూర్పుయడవల్లిలో..

* పెంటపాడు మండలం కస్పాపెంటపాడు బైరాగిమఠంలోని శ్రీగోపాలస్వామి, శ్రీఆంజనేయస్వామి దేవస్థానంలో సీతారాముల కల్యాణం గురువారం కనుల పండువగా నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, మాజీ ఎమ్మెల్యే ఈలి మధుసూదనరావు (నాని) స్వామి వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కల్యాణ క్రతువును తిలకించారు. అనంతరం భారీ అన్నసమారాధన నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ బైరాగి మఠాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దేవస్థానం ఆవరణలో కల్యాణ మండప నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని