logo

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి

తణుకు మండలం దువ్వ గ్రామంలోని శ్రీవేణుగోపాలస్వామి, సీతారామస్వామి దేవస్థానంలో గురువారం శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది.

Published : 31 Mar 2023 04:38 IST

దగ్ధమవుతున్న పందిరి

దువ్వ (పెంటపాడు), న్యూస్‌టుడే: తణుకు మండలం దువ్వ గ్రామంలోని శ్రీవేణుగోపాలస్వామి, సీతారామస్వామి దేవస్థానంలో గురువారం శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. తాటాకు పందిరి అగ్నికి ఆహుతైంది. అగ్నిమాపక అధికారులు, దేవస్థానం ఈవో సూర్యనారాయణ తెలిపిన వివరాలిలా.. శ్రీరామనవమి సందర్భంగా ఉదయం స్వామివార్ల ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో దేవస్థానం పైకప్పులో షార్ట్‌సర్క్యూట్‌ ఏర్పడి నిప్పులు రేగి తాటాకు పందిరికి అంటుకున్నాయి. మంటలు పందిరంతా వ్యాపించాయి. భక్తులు గ్రామోత్సవంలో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో దేవస్థానంలో ఇద్దరు మాత్రమే ఉన్నారు. వారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. స్థానికులు మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించినా తాటాకులు అందనంత ఎత్తులో ఉండటంతో ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న తణుకు అగ్నిమాపక కేంద్ర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. ఈ నేపథ్యంలో సీతారామస్వామి కల్యాణ క్రతువును సమీపంలోని కేశవస్వామి ఆలయంలో నిర్వహించారు. అనంతరం శ్రీవేణుగోపాలస్వామి, సీతారామస్వామి దేవస్థానం ప్రాంగణాన్ని శుభ్రం చేయించి, శాంతి హోమం, ప్రత్యేక పూజలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని