logo

అజాత శత్రువుకు అంతిమ వీడ్కోలు

రాజకీయాల్లో అజాత శత్రువు, మితభాషి, విలువలకు కట్టుబడిన పెద్దాయనగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి (బెనర్జీ) పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు గురువారం ఉప్పులూరు గ్రామానికి పలువురు ప్రముఖులు తరలివచ్చారు.

Updated : 31 Mar 2023 05:54 IST

నారాయణస్వామికి ఘన నివాళులు

యర్రా పార్థివ దేహంపై పుష్పగుచ్ఛం ఉంచుతున్న మంత్రి కొట్టు సత్యనారాయణ

ఉండి, న్యూస్‌టుడే: రాజకీయాల్లో అజాత శత్రువు, మితభాషి, విలువలకు కట్టుబడిన పెద్దాయనగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి (బెనర్జీ) పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు గురువారం ఉప్పులూరు గ్రామానికి పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఘనంగా నివాళులు అర్పించి అంతిమ వీడ్కోలు పలికారు. పంచాయతీ సర్పంచి నుంచి రాజ్యసభ సభ్యునిగా ప్రాతినిథ్యం వహించి ఆ పదవులకు వన్నె తెచ్చిన నారాయణస్వామి బుధవారం సాయంత్రం కన్ను మూసిన విషయం తెలిసిందే. ఉప్పులూరులోని ఆయన స్వస్థలానికి పార్థివ దేహాన్ని తరలించారనే సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర నలుమూలల నుంచి తెదేపా, వైకాపా, జనసేన, సీపీఎం, సీపీఐ, రైతు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఘనంగా నివాళులర్పించారు.

పూలమాల వేస్తున్న పుల్లారావు, తెదేపా నాయకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని