logo

ఆక్రమణల తొలగింపులో రాజీ వద్దు: కలెక్టర్‌

పట్టణంలో అభివృద్ధి అనేది మాటల్లో కాకుండా ఆచరణలో చూపాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులకు సూచించారు.

Published : 31 Mar 2023 04:38 IST

పురపాలక అధికారులకు సూచనలిస్తున్న ప్రశాంతి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలో అభివృద్ధి అనేది మాటల్లో కాకుండా ఆచరణలో చూపాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులకు సూచించారు. భీమవరంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఆకస్మికంగా పర్యటించారు. అండర్‌పాస్‌ సమీపంలో ఫుడ్‌ కోర్టు ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించాలన్నారు. లంకపేట పరిధిలో ఆక్రమణలు తొలగించిన ప్రాంతాన్ని చూశారు. సోమగుండం చెరువు ఆధునికీకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూడాలని, ఆక్రమణల తొలగింపు విషయంలో రాజీ పడొద్దని సూచించారు. రహదారుల పక్కన పేవర్‌బ్లాక్‌లు పూర్తికానిచోట వెంటనే పనులు చేయాలన్నారు. కమిషనర్‌ ఎస్‌.శివరామకృష్ణ, డీఈ టి.వి.నారాయణరావు, టీపీవో సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని