logo

క్రైమ్ న్యూస్

ఏలూరు నగరంలోని రైల్వే క్వార్టర్స్‌ ప్రాంగణంలో ఉన్న చెరువులో ఓ గుర్తుతెలియని యువకుడి మృతదేహం కనిపించడం కలకలం రేపింది.

Published : 31 Mar 2023 04:38 IST

చెరువులో గుర్తుతెలియని యువకుడి మృతదేహం

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఏలూరు నగరంలోని రైల్వే క్వార్టర్స్‌ ప్రాంగణంలో ఉన్న చెరువులో ఓ గుర్తుతెలియని యువకుడి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. గురువారం రాత్రి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు టూటౌన్‌ ఎస్సై ప్రసాద్‌ సంఘటనా ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వయసు 25 నుంచి 30 ఏళ్లు ఉండవచ్చని, ప్రమాదవశాత్తూ పడిపోయాడా..?, ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఎవరైనా చంపి ఇక్కడ పడేశారా..?తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


పేలు మందు తాగి ఆత్మహత్యాయత్నం

నూజివీడు పట్టణం, న్యూస్‌టుడే: చాట్రాయి మండలం పిట్టలవారిగూడేనికి చెందిన ఓ వివాహిత పేలు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలు, ఆమె తల్లి కథనం మేరకు.. సదరు మహిళకు 12 ఏళ్ల కిందట వివాహమైంది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త తరచూ అనుమానిస్తూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం కొట్టడంతో మనస్తాపం చెంది ఇంటి వద్ద పేలు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై విచారణ చేస్తున్నట్లు నూజివీడు పోలీసులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు