logo

అనుమతులు లేని వైద్యశాల సీజ్‌

భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో ఎటువంటి అనుమతులు, అర్హత లేకుండా పీఎంపీ నిర్వహిస్తున్న వైద్యశాలను వైద్య, ఆరోగ్యశాఖాధికారులు శుక్రవారం సీజ్‌ చేశారు.

Published : 01 Apr 2023 06:09 IST

వైద్యశాలను తనిఖీ చేస్తున్న అధికారులు

పూళ్ల (భీమడోలు), న్యూస్‌టుడే: భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో ఎటువంటి అనుమతులు, అర్హత లేకుండా పీఎంపీ నిర్వహిస్తున్న వైద్యశాలను వైద్య, ఆరోగ్యశాఖాధికారులు శుక్రవారం సీజ్‌ చేశారు. పూళ్ల గ్రామంలో వినాయకుడి గుడి సమీపంలో పెనుగొండ శ్రీనివాసరావు అనే పీఎంపీ అనుమతులు లేకుండా వైద్యశాల నిర్వహిస్తూ... అధిక ధరలకు  ఔషధాలు విక్రయిస్తున్నారంటూ ఎం.ఎం.పురం గ్రామానికి చెందిన బిరుదుగడ్డ నరేష్‌ ఇటీవల ‘స్పందన’ కార్యక్రమంలో వైద్యశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీఎంహెచ్‌వో ఆశా ఆదేశాల మేరకు స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి లీలాప్రసాద్‌, ప్రైవేటు వైద్యశాలలను పర్యవేక్షించే రత్నకుమారి తదితరులు సంబంధిత వైద్యశాలను తనిఖీ చేశారు. అనుమతి లేకుండా వైద్యశాల నిర్వహిస్తున్నారని గుర్తించి సీజ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు