logo

పది పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

పది పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ తెలిపారు.

Published : 01 Apr 2023 06:09 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌

ఏలూరు టూటౌన్‌,. న్యూస్‌టుడే: పది పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ తెలిపారు. ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో కలెక్టరేట్లో శుక్రవారం ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మతో కలిసి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, 100 మీటర్ల లోబడి ఎలాంటి ఫొటోస్టాట్‌ దుకాణాలు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్విజిలేటర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్ల వద్ద కూడా చరవాణులు ఉండటానికి వీల్లేదన్నారు. ఆయా కేంద్రాల వద్ద పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యార్థులకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మందులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 26,217 మంది రెగ్యులర్‌ విద్యార్థులకు 120 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఏవీఎస్‌ఎన్‌ మూర్తి, జడ్పీ సీఈవో రవికుమార్‌, జిల్లా పాఠశాల విద్యా శాఖాధికారి రవిసాగర్‌, డీఎంహెచ్‌వో ఆశ, పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎల్‌.శ్రీకాంత్‌, విద్యుత్తు ఎస్‌ఈ సాల్మన్‌ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి చేయూత అందిస్తామన్నారు. పెదవేగి మండలం రామసింగవరంలో 50 ఎకరాల భూమిని ఆయిల్‌ఫెడ్‌  వారికి నూతనంగా పరిశ్రమ, నర్సరీ ఏర్పాటుకు కేటాయించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధంచేయాలని, వట్లూరు భోగాపురం గ్రామాల్లో 25 ఎకరాల్లో, ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పరిశ్రమల శాఖ కేంద్రం జనరల్‌ మేనేజర్‌ ఏసుదాసు, డీపీవో మల్లికార్జునరావు, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని