logo

వైభవంగా రథోత్సవం

పెంటపాడు మండలం కస్పాపెంటపాడులోని భైరాగిమఠం శ్రీగోపాలస్వామి, శ్రీఆంజనేయస్వామివార్ల దేవస్థానంలో శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామి వారి దివ్య రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

Published : 01 Apr 2023 06:09 IST

పెంటపాడు న్యూస్‌టుడే: పెంటపాడు మండలం కస్పాపెంటపాడులోని భైరాగిమఠం శ్రీగోపాలస్వామి, శ్రీఆంజనేయస్వామివార్ల దేవస్థానంలో శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామి వారి దివ్య రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రధానార్చకుడు త్రిలోచనదాస్‌ బ్రహ్మత్వంలో సహ   అర్చకుడు పూర్ణచంద్ర త్రిపాఠి సహకారంతో స్వామివారికి ఉదయం నుంచి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం మేళతాళాలు, తీన్‌మార్‌ డప్పులు, బాణసంచా కాల్పుల నడుమ ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఊరేగించారు. రథాన్ని లాగేందుకు భక్తులు, యువకులు పోటీ పడ్డారు. గ్రామస్థులు స్వామివారికి అరటి గెలలు సమర్పించుకున్నారు. ఆలయ ఈవో చీమలకొండ సాయి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

పెంటపాడు: స్వామివారి రథాన్ని లాగుతున్న భక్తులు

కామవరపుకోట, న్యూస్‌టుడే: చినభద్రాద్రిగా పేరొందిన కామవరపుకోట మండలం తూర్పుయడవల్లి సీతారామచంద్రస్వామి వారి సామ్రాజ్య పట్టాభిషేకం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ పండితులు  స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని