logo

కలెక్టరేట్‌కు 20 ఎకరాల కేటాయింపు

జిల్లా కేంద్రం భీమవరంలో కలెక్టరేట్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో 20 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 01 Apr 2023 06:09 IST

వ్యవసాయ మార్కెట్‌ యార్డు కార్యాలయం

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే:  జిల్లా కేంద్రం భీమవరంలో కలెక్టరేట్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో 20 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ బహుళ ప్రయోజన భవన సముదాయాన్ని నిర్మించే ప్రతిపాదన ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఏడాదిలోపే.. జిల్లాల విభజన జరిగి ఏప్రిల్‌ 4వ తేదీకి ఏడాది పూర్తవుతుంది. జిల్లా కేంద్రంగా భీమవరం ఆవిర్భవించాక అద్దె భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్‌ ఊరికి దూరంగా ఉంది. అక్కడికి వెళ్లి రావడం సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగులకు భారంగా మారింది. మార్కెట్‌ యార్డు పట్టణంలో జంక్షన్‌ రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ బస్టాండ్‌, జాతీయ రహదారికి దగ్గరగా ఉంది. వీలైనంత త్వరగా ఇక్కడ శాశ్వత భవనాలు నిర్మిస్తే అందరికీ మేలు జరగనుంది. కలెక్టర్‌ ప్రశాంతి కృషి వల్లే ఏడాదిలోపు కలెక్టరేట్‌కు అనువైన స్థలం సమకూరిందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్‌ యార్డుకు విస్సాకోడేరులో మరో స్థలం కేటాయించనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని