logo

అర్ధరాత్రి వరకూ అక్కడే ఉండి..

పాలకొల్లు టిడ్కో గృహ సముదాయంలో నీరు రావడం లేదని లబ్ధిదారులు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు గురువారం రాత్రి చరవాణిలో ఫిర్యాదు చేశారు.

Published : 01 Apr 2023 06:09 IST

మహిళలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నిమ్మల

పాలకొల్లు, న్యూస్‌టుడే: పాలకొల్లు టిడ్కో గృహ సముదాయంలో నీరు రావడం లేదని లబ్ధిదారులు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు గురువారం రాత్రి చరవాణిలో ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే రాత్రి 9 గంటలు దాటాక ద్విచక్ర వాహనంపై గృహ సముదాయానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఎమ్మెల్యే రాకను గమనించిన లబ్ధిదారులు అక్కడికి చేరుకుని తమ సమస్యను వివరించారు. ఎమ్మెల్యే అక్కడి నుంచే పురపాలిక కమిషనర్‌ శేషాద్రికి ఫోన్‌చేసి ట్యాంకర్లను పంపించాలని కోరారు. అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి పాడైపోయిన మోటార్లకు మరమ్మతులు చేయించారు. శుక్రవారం ఉదయం మరోసారి అక్కడికి వెళ్లి పరిస్థితిని  తెలుసుకున్నారు. సమస్య తీరిందని లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని