logo

మహానాడు వేదికగా ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు : దేవినేని

రాజమహేంద్రవరంలో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న మహానాడుకు తెదేపా శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు.

Published : 26 May 2023 03:19 IST

పుస్తకాలు ఆవిష్కరిస్తున్న ఉమమహేశ్వరరావు, గన్ని తదితరులు

ఉంగుటూరు, న్యూస్‌టుడే:  రాజమహేంద్రవరంలో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న మహానాడుకు తెదేపా శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఉంగుటూరు తెదేపా కార్యాలయంలో మహానాడు సన్నాహాలపై గురువారం సమావేశం నిర్వహించారు. నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు మహానాడు వేదికగా అట్టహాసంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మహానాడులో చంద్రబాబు నాయుడు ఎండగడతారన్నారు. మహానాడు వేదికగా ఎన్నికల సంగ్రామానికి శంఖారావం పూరిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం, రాజధాని అమరావతి అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ స్ఫూర్తితో జగన్‌ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అనంతరం స్థానిక ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ‘దళిత ద్రోహి జగన్‌ రెడ్డి - పేదల పాలిట పెన్నిధి చంద్రన్న’ పుస్తకాలను ఆవిష్కరించారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రెడ్డి సూర్యచంద్రరావు, నాయకులు నల్ల ఆనంద్‌, కడియాల రవిశంకర్‌, ఇమ్మణి గంగాధర్‌రావు, వంగపండు సత్యనారాయణ, యాళ్ల సంజీవరావు, ఆశీర్వాదం, కృష్ణమోహన్‌, కరణం పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు




 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు