logo

రహదారి భద్రత అందరి బాధ్యత

రహదారి భద్రత అందరి బాధ్యతని, ఇందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంగా పనిచేస్తూ సమష్టిగా పాటుపడాలని రోడ్డు భద్రత అథారిటీ ఛైర్మన్‌, డీజీపీ కేఆర్‌ఎం కిశోర్‌ కుమార్‌ అన్నారు.

Published : 26 May 2023 03:19 IST

మాట్లాడుతున్న రోడ్డు భద్రతా అథారిటీ ఛైర్మన్‌, డీజీపీ కిశోర్‌కుమార్‌

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: రహదారి భద్రత అందరి బాధ్యతని, ఇందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంగా పనిచేస్తూ సమష్టిగా పాటుపడాలని రోడ్డు భద్రత అథారిటీ ఛైర్మన్‌, డీజీపీ కేఆర్‌ఎం కిశోర్‌ కుమార్‌ అన్నారు. రాష్ట్రంలో రహదారులపై ప్రమాదాలను నివారించేందుకు, భద్రతను పెంపొందించేందుకు విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖ చేపట్టిన రహదారి భద్రత అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని ఓ హోటల్‌ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం సదస్సు ఏర్పాటు చేశారు. ఆర్‌అండ్‌బీ, పోలీసు, రవాణా, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన కిశోర్‌ కుమార్‌ మాట్లాడుతూ భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎలాంటి ముందస్తు ప్రణాళికకైనా పూర్తి సహకారం అందిస్తామన్నారు. రాష్ట్ర రహదారులపై జరుగుతున్న ప్రమాదాలు, వాటి తీవ్రతను బట్టి 220 కిలోమీటర్ల మేర మూడు హైవేలను డెమో కారిడార్లుగా, మరో 1000 కిలోమీటర్ల మేర 26 హైవేలను హజార్డ్స్‌ కారిడార్లుగా గుర్తించామన్నారు. మూడు డెమో కారిడార్లలో నరసాపురం- అశ్వారావుపేట, ఏలూరు- జంగారెడ్డిగూడెం హైవేలు ఉన్నాయని తెలిపారు. వీటిపై ప్రమాదాల నివారణకు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక భద్రత పరికరాల సాయంతో ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ రహదారి ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ ప్రాధాన్యమిచ్చి ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోందని తెలిపారు. ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ భాస్కరరావు, పరిశ్రమల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ గిరిధర్‌ తదితరులు మాట్లాడారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు