సమస్యలే తొలిపాఠాలు
వేసవి సెలవుల అనంతరం జూనియర్ కళాశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. నూతన విద్యా సంవత్సరానికి పలుచోట్ల సమస్యలు స్వాగతం పలికాయి.
జూనియర్ కళాశాలల్లో వసతుల లేమి
నాడు-నేడు పనుల్లో జాప్యం
ఏలూరు విద్యా విభాగం, పెదపాడు, న్యూస్‌టుడే
ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అసంపూర్తిగా నిర్మాణ పనులు
వేసవి సెలవుల అనంతరం జూనియర్ కళాశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. నూతన విద్యా సంవత్సరానికి పలుచోట్ల సమస్యలు స్వాగతం పలికాయి. మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు సమస్యల నడుమ చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ‘నాడు-నేడు’ కార్యక్రమం కింద ఎంపిక చేశారు. అభివృద్ధి పనులకు ఒక్కో కళాశాలకు అవసరానికి అనుగుణంగా రూ.7 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ప్రభుత్వం మంజూరుచేసింది. వీటితో ప్రహరీలు, మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు తాగునీటి వసతి కల్పించడం, రంగులు వేయించడం ఇతర సౌకర్యాలను కల్పించాల్సి ఉంది. పూర్తి చేసిన పనుల మేరకు రివాల్వింగ్ ఫండ్‌ను ప్రభుత్వం దశల వారీగా విడుదల చేస్తూ ఉంటుంది. పలు కళాశాలల్లో పనుల్లో తీవ్ర జాప్యం నెలకొనడంతో విద్యార్థులకు సమస్యలు తప్పడం లేదు.
ఏలూరులో హాజరైన ఏడుగురు విద్యార్థులకు పుస్తకాలు లేకుండానే పాఠాలు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 32 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా శాశ్వత ప్రాతిపదికన 120 మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఒప్పంద విధానంలో సుమారు 400 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. పొరుగు సేవల పద్ధతిలో దాదాపు 80 మంది పనిచేస్తున్నారు. 2012లో ఏపీపీఎస్‌సీ ద్వారా శాశ్వత ప్రాతిపదికన అధ్యాపకులను నియమించారు. తర్వాత 2020లో కొన్ని పోస్టులు భర్తీ చేశారు. విద్యార్థుల సంఖ్యకనుగుణంగా శాశ్వత ప్రాదిపదికన అధ్యాపకులను నియమించాల్సి ఉండగా.. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. చాలా ఏళ్లకు ఒకసారి మాత్రమే నియామకాలు చేపడుతోంది. ఈ కారణంగా చాలా కళాశాలల్లో ఒప్పంద విధానంలో పని చేసేవారే ఉన్నారు. శాశ్వత ప్రాతిపదికన పనిచేసే అధ్యాపకులు లేకపోవడంతో ఉత్తీర్ణత శాతంపై ప్రభావం పడుతోందనే విమర్శ వినిపిస్తోంది.
పోలవరంలో..
ఈ ఏడాదీ అరకొర
పెదపాడులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేపట్టిన ‘నాడు-నేడు’ పనులు పూర్తి కాలేదు. ఈ కారణంగా ఈ ఏడాదీ విద్యార్థులు అరకొర సదుపాయాలతో చదువులు సాగించాల్సిందేనని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం కళాశాలకు రూ.27,46,800 కేటాయించింది. ఈ నిధులతో మరుగుదొడ్ల నిర్మాణం, మంచినీరు, విద్యుత్తు సౌకర్యం, ల్యాబ్ తదితర పనులు చేపట్టాల్సి ఉంది. వరండాలో గ్రిల్స్ వేయడం మాత్రం పూర్తి చేశారు. వరండాలో ఫ్లోర్ కుంగి పగుళ్లివ్వడంతో విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారు. అదనపు తరగతి గదులు పూర్తి కావాల్సి ఉండగా.. వాటి కోసం ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు కళాశాల ప్రిన్సిపల్ జి.సుబ్రమణ్యేశ్వరరావు తెలిపారు.
పెదపాడు కళాశాలలో తరగతి గదుల్లో పనులు సాతుండటంతో బయట ఉంచిన బల్లలు
పెదపాడులో అసంపూర్తిగా మరుగుదొడ్ల నిర్మాణం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TS News: తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్లు .. నేటి నుంచి అమల్లోకి
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
CM Bungalow: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
Tamannaah: అలాంటి సీన్స్‌లో నటించడం మానేశా: దక్షిణాది చిత్రాలపై తమన్నా వ్యాఖ్యలు