వేతనాలు ఇవ్వకుంటే బతికేదెలా?
ఆరు వారాలుగా ఉపాధి హామీ పనులు చేస్తున్నా ఇంతవరకూ వేతనాలు చెల్లించడం లేదంటూ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ కూలీల ఆందోళన
కొప్పాక పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న ఉపాధి కూలీలు
పెదవేగి, న్యూస్‌టుడే: ఆరు వారాలుగా ఉపాధి హామీ పనులు చేస్తున్నా ఇంతవరకూ వేతనాలు చెల్లించడం లేదంటూ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. పెదవేగి మండలం కొప్పాక గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు సర్పంచి భాస్కర దీక్షితులు ఆధ్వర్యంలో గురువారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న ఎంపీడీవో రాజ్‌మనోజ్ పంచాయతీ కార్యాలయానికి వచ్చి కూలీలతో చర్చించారు. కొత్త పనులకు ప్రతిపాదనలు లేవని, చేసే పనులకు మస్తర్లు వేయడం లేదని, సిబ్బంది సహకరించడం లేదని సర్పంచి భాస్కర దీక్షితులు, కూలీలు ఎంపీడీవో దృష్టికి తీసుకొచ్చారు. ఆరు వారాలు గడిచినా వేతనాలు చెల్లించకపోతే బతికేదెలా అంటూ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాజ్‌మనోజ్ మాట్లాడుతూ సర్పంచి, కూలీల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కొత్త పనులు ప్రతిపాదించి గ్రామ పంచాయతీకి పంపి నెలలు గడుస్తున్నా ఇంత వరకూ తీర్మానం చేయలేదన్నారు. తీర్మానం చేయగానే కూలీలకు పనులు కల్పిస్తామని ఎంపీడీవో హామీ ఇవ్వడంతో కూలీలు ఆందోళనను విరమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: ఆసియా క్రీడలు.. నీరజ్‌కు స్వర్ణం, కిశోర్‌కు రజతం
-
Chandrababu Arrest: ఆంక్షలు దాటి, పోలీసుల కళ్లు కప్పి.. ర్యాలీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Sanjay Singh: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టు
-
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త
-
Rohit On WC 2023: మా టార్గెట్ అదే.. అలాంటి పోలికలను పట్టించుకోం: రోహిత్
-
TS News: తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల.. వర్గాల వారీగా ఇదీ లెక్క!