logo

రైతు రుణం తీర్చుకోలేనిది: ఎమ్మెల్యే

తల్లి రుణం, రైతుల రుణం తీర్చుకోలేనిదని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. రైతుభరోసా- పీఎంకిసాన్‌ కార్యక్రమంలో అయిదో ఏడాది తొలివిడత నిధులను గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో సీఎం జగన్‌  విడుదల చేశారు.

Published : 02 Jun 2023 04:13 IST

రైతు భరోసా నమూనా చెక్కులు అందజేస్తున్న బాలరాజు

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: తల్లి రుణం, రైతుల రుణం తీర్చుకోలేనిదని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. రైతుభరోసా- పీఎంకిసాన్‌ కార్యక్రమంలో అయిదో ఏడాది తొలివిడత నిధులను గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో సీఎం జగన్‌  విడుదల చేశారు. ఈ మేరకు జిల్లాస్థాయిలో కొయ్యలగూడెంలోని ఏఎంసీ ప్రాంగణంలో జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో 1,99,719 మంది రైతులకు సుమారు రూ.149.78 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా భూహక్కు కలిగిన రైతులతోపాటు పోడుభూములు సాగు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రైతులకు ఏటా రూ.13,500 చొప్పున రైతుభరోసా సాయం అందిస్తున్న ఘనత వైకాపా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అనంతరం రైతుభరోసా- పీఎంకిసాన్‌ తొలివిడత నగదుకు సంబంధించిన నమూనా చెక్కులను ప్రజాప్రతినిధులతో కలిసి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఎమ్మెల్యే తిలకించారు. కార్యక్రమంలో ఎంపీపీ గంజిమాల రామారావు, జడ్పీటీసీ సభ్యురాలు దాసరి శ్రీలక్ష్మి, రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యురాలు గంజిమాల దేవి, జిల్లా వ్యవసాయ అధికారి వై.రామకృష్ణ, ఆర్డీవో ఝాన్సీరాణి, ఏడీఏ బుజ్జిబాబు, మండల వ్యవసాయాధికారి చెన్నకేశవులు, పలువురు సర్పంచులు, వైకాపా నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని