క్షయ వ్యాధి నియంత్రణలో జిల్లాకు బంగారు పతకం
క్షయ వ్యాధి రహిత దిశగా ఏలూరు జిల్లా పురోగతి సాధించినందుకు జాతీయ స్థాయిలో బంగారు పతకం లభించింది.
పతకం, ధ్రువపత్రాన్ని కలెక్టర్‌కు చూపుతున్న అధికారులు
ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: క్షయ వ్యాధి రహిత దిశగా ఏలూరు జిల్లా పురోగతి సాధించినందుకు జాతీయ స్థాయిలో బంగారు పతకం లభించింది. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డి.ఆశ, అదనపు డీఎంహెచ్‌వో, జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారిణి జి.రత్నకుమారిలను కలెక్టర్ అభినందించారు. 2015-22 సంవత్సరాల మధ్య క్షయ నియంత్రణ కార్యక్రమాల్లో జిల్లా యంత్రాంగం చేసిన కృషికి గాను ఈ పురస్కారం దక్కిందని కలెక్టర్ తెలిపారు. క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు వైద్య శాఖ కృషి ఒక్కటే సరిపోదని, నివారణ చర్యలపై ప్రజలు తగిన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్త జి.రఘు, డీపీఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TS News: తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్లు .. నేటి నుంచి అమల్లోకి
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
CM Bungalow: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
Tamannaah: అలాంటి సీన్స్‌లో నటించడం మానేశా: దక్షిణాది చిత్రాలపై తమన్నా వ్యాఖ్యలు