వంతెనపై నుంచి పల్టీకొట్టిన కారు.. వ్యాపారి మృతి
జంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం వంతెనపై నుంచి కాలువలోకి కారు పల్టీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందారు.
హరిసూర్యనారాయణమూర్తి (పాతచిత్రం)
జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం వంతెనపై నుంచి కాలువలోకి కారు పల్టీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన వ్యాపారి తోకల హరిసూర్యనారాయణమూర్తి(39) తన కారులో వివాహ వేడుకకు వెళుతుండగా.. దేవరపల్లి-తల్లాడ జాతీయ రహదారిపై జంగారెడ్డిగూడెం శివారులో బయనేరు వంతెన వద్ద వాహనం అదుపుతప్పి పైనుంచి కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో హరి సూర్యనారాయణమూర్తి ఘటనాస్థలిలోనే మృతి చెందారు. పోలీసులు పొక్లెయిన్ సహాయంతో కారులో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి పరీక్ష నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రాంతీయాసుపత్రికి తరలించారు. ఘటనపై మృతుడి బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు పోలీస్‌స్టేషన్ రైటర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
నుజ్జునుజ్జయిన కారు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
JDS: భాజపా నేతలతో దేవెగౌడ కీలక భేటీ.. ఎన్డీయేలో జేడీఎస్ చేరికకు రంగం సిద్ధం?
-
Vijay antony: కుమార్తె మృతి.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ పోస్ట్
-
Rupert Murdoch: ‘ఫాక్స్’ ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలిగిన రూపర్ట్ మర్దోక్
-
Stomach Pain: కడుపు నొప్పితో ఆస్పత్రికి.. ‘ఎక్స్-రే’ చూస్తే షాక్!
-
World Cup: ఆ ఇద్దరూ ఉండటం వల్లే సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదు: హర్భజన్ సింగ్
-
TDP: వైకాపా దౌర్జన్యాలను ఎలా ఎదుర్కొందాం? టీడీఎల్పీలో చర్చ