వైకాపా ఫ్లెక్సీలు తొలగించాలంటూ జనసేన నిరసన
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కించపరుస్తూ వైకాపా ఏర్పాటు చేసిన అభ్యంతరకర ఫ్లెక్సీలను తొలగించాలని జనసేన నాయకులు నల్లగోపుల చలపతి, కొల్లి బాబీ, తోట లక్ష్మి డిమాండ్ చేశారు.
శిక్షణ కలెక్టరు భరత్‌కు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
కైకలూరు, న్యూస్‌టుడే: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కించపరుస్తూ వైకాపా ఏర్పాటు చేసిన అభ్యంతరకర ఫ్లెక్సీలను తొలగించాలని జనసేన నాయకులు నల్లగోపుల చలపతి, కొల్లి బాబీ, తోట లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలో శుక్రవారం నల్ల దుస్తులు ధరించి పార్టీ శ్రేణులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో విద్వేషాలు సృష్టించేందుకే వైకాపా నాయకులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో నియోజకవర్గంలో ఉన్న వైకాపా ఫ్లెక్సీలన్నింటినీ తొలగించని పక్షంలో ప్రతి గ్రామంలో తాము ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం రెవెన్యూ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి శిక్షణ కలెక్టరు అపూర్వ భరత్, పట్టణ సీఐ ఎ.రఘు, ఎంపీడీవో రామలింగేశ్వరరావులకు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు రాజేశ్వరి, నాగార్జున, శివబాబు, సంజయ్, యుగేంద్ర, సాయి, వడ్డీకాసులు, అభినయ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: నష్టాల్లోనే మార్కెట్ సూచీలు.. 19,450 దిగువన స్థిరపడ్డ నిఫ్టీ
-
Ranbir Kapoor: రణ్‌బీర్ కపూర్‌కు ఈడీ సమన్లు
-
Union Cabinet: పసుపు బోర్డుకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. సిలిండర్‌పై రాయితీ ₹300లకు పెంపు
-
Nellore: నెల్లూరులో ఉద్రిక్తత.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
-
Sai Pallavi: రాముడిగా రణ్‌బీర్.. సీతగా సాయిపల్లవి ఫిక్స్!
-
IMA: ఆస్పత్రి డీన్‌తో టాయిలెట్లు కడిగిస్తారా? ఐఎంఏ హెచ్చరిక!