logo

పాఠశాలలు తెరిచే నాటికి విద్యాకానుకలు: కలెక్టర్‌

వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే నాటికి విద్యా కానుక కిట్లు అందజేయాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published : 03 Jun 2023 04:02 IST

పాఠ్య పుస్తకాలను పరిశీలిస్తున్న ప్రసన్న వెంకటేశ్‌

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే నాటికి విద్యా కానుక కిట్లు అందజేయాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరు అర్బన్‌, గ్రామీణ పరిధిలోని 119 పాఠశాలలకు సంబంధించి నగరంలోని సెయింట్‌ జేవియర్‌ ఉన్నత పాఠశాలలో భద్రపరిచిన విద్యాకానుక కిట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. పాఠ్య పుస్తకాలతో పాటు బూట్ల నాణ్యతను పరిశీలించారు. స్కూలు బ్యాగులు, ఏకరూప దుస్తులు, బెల్టులు రావాల్సి ఉందని ఏలూరు ఎంఈవో నరసింహమూర్తి కలెక్టర్‌కు తెలిపారు. విద్యార్థులకు బూట్ల కొలతల్లో తేడాలు రాకుండా చూడాలని కలెక్టర్‌ సూచించారు.  మార్పులు, చేర్పులుంటే స్టాక్‌ పాయింట్లలోనే సరిచేయాలన్నారు. కార్యక్రమంలో ఏలూరు తహసీల్దారు సోమశేఖర్‌, సీఎంవో రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని