logo

నాడు-నేడు పనుల పరిశీలన

పెదపాడు, ఏలూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ పరిశీలించారు.

Published : 03 Jun 2023 04:02 IST

పెదపాడు కళాశాలలో పరిశీలిస్తున్న కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌

ఏలూరు విద్యా విభాగం, పెదపాడు, న్యూస్‌టుడే: పెదపాడు, ఏలూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ పరిశీలించారు. ‘సమస్యలే తొలి పాఠాలు’ శీర్షికతో ‘ఈనాడు’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. కలెక్టర్‌ పెదపాడు కళాశాలను సందర్శించి నాడు-నేడు పనుల తీరును పరిశీలించారు. కళాశాల ప్రధానాచార్యుడు సుబ్రహ్మణ్యం నాడు-నేడు పనుల వివరాలను తెలియజేశారు.  ఇప్పుడున్న నాలుగు తరగతి గదుల ఆధునికీకరణకు రూ.28.10 లక్షలు మంజూరు కాగా, రివాల్వింగ్‌ ఫండ్‌ కింద రూ.7.30 లక్షలను ఇప్పటివరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. జూన్‌ నెలాఖరుకు పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దారు విజయకుమార్‌రాజు, ఏఈ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.ః  నగరంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మరుగుదొడ్ల నిర్మాణ పనులతోపాటు తాగునీటి వసతి, మరమ్మతులను కలెక్టర్‌ పరిశీలించారు. నెలాఖరుకు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. తహసీల్దారు సోమశేఖర్‌, ప్రధానాచార్యుడు ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు