logo

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి ప్రత్నామ్నాయ వస్తువులను వినియోగించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌ఛార్జి ఛైర్మన్‌, మొదటి అదనపు జిల్లా జడ్జి జి.రామ్‌గోపాల్‌ అన్నారు.

Published : 06 Jun 2023 04:28 IST

జైలు ప్రాంగణంలో మొక్క నాటుతున్న జడ్జి రామ్‌గోపాల్‌ తదితరులు

ఏలూరు కలెక్టరేట్‌, ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి ప్రత్నామ్నాయ వస్తువులను వినియోగించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌ఛార్జి ఛైర్మన్‌, మొదటి అదనపు జిల్లా జడ్జి జి.రామ్‌గోపాల్‌ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ప్రాంగణంలో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రెండో అదనపు జిల్లా జడ్జి మంగాకుమారి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌ఛార్జి కార్యదర్శి కేకేవీ బుల్లి కృష్ణ, పర్మినెంటు లోక్‌ అదాలత్‌ ఛైర్‌పర్సన్‌ మేరీగ్రేస్‌ కుమారి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అబ్బినేని విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

* కలెక్టరేట్‌లో సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. గోదావరి సమావేశ మందిరం వద్ద కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌  మొక్క నాటారు. అనంతరం మాట్లాడుతూ వాతావరణ కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటడంతో పాటు సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్వో సత్యనారాయణమూర్తి, డీఎఫ్‌వో ఎం.హిమశైలజ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని