logo

ఆర్జీయూకేటీ ప్రవేశాలకు 4,498 దరఖాస్తులు

ఆర్జీయూకేటీ (రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల పర్వం మొదలైంది.

Updated : 06 Jun 2023 05:29 IST

నూజివీడు, న్యూస్‌టుడే: ఆర్జీయూకేటీ (రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల పర్వం మొదలైంది. ఈ నెల 4 నుంచి 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌లో పేర్కొంది. 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సుమారు 4,498 దరఖాస్తులు వచ్చాయని ప్రవేశాల కన్వీనరు ఆచార్య గోపాలరాజు తెలిపారు.
* విశ్వవిద్యాలయం జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు పదో తరగతిలో సాధించిన మార్కులకు ఎప్పటిలానే వెనుకబాటు సూచీ కింద 4 శాతం మార్కులు కలుపుతారు.

ప్రతి క్యాంపస్‌లో 1,100 సీట్లు.. ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో ఒక్కో క్యాంపస్‌లో వెయ్యి సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద అదనంగా మరో 100 సీట్లతో నాలుగు క్యాంపస్‌లకు మొత్తం 4,400 మంది విద్యార్థులతో భర్తీ చేస్తారు. వీరిలో 85 శాతం ఏపీ అభ్యర్థులు ఉంటే, 15 శాతం ఓపెన్‌ మెరిట్‌ కోటాలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు కేటాయిస్తారు.

టై అయితే.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థుల మధ్య టై ఏర్పడితే తొలుత గణితంలో అధిక మార్కులు వచ్చిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు. అక్కడా టై అయితే వరుస క్రమంలో జనరల్‌ సైన్స్‌, ఇంగ్లిషు, సోషల్‌ స్టడీస్‌ సబ్జెక్టుల్లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అప్పటికీ టై అయితే ఫస్ట్‌ లాంగ్వేజ్‌ మార్కులు, ఆ తర్వాత పుట్టిన తేదీ ప్రకారం ఎక్కువ వయసున్న అభ్యర్థి, ఎవరు ముందు దరఖాస్తు చేస్తే వారిని పరిగణనలోకి తీసుకుంటారు. ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు 5 శాతం సూపర్‌ న్యూమరీ కోటా అందుబాటులో ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని