logo

రూ.215కు చేరిన వర్జీనియా పొగాకు ధరలు

వర్జీనియా పొగాకు ధరల్లో పెరుగుదల మొదలైంది. ఎన్‌ఎల్‌ఎస్‌లోని అయిదు పొగాకు వేలం కేంద్రాల్లో సోమవారం మేలు రకం పొగాకుకు కేజీకి అత్యధికంగా రూ.215 ధర లభించింది.

Published : 06 Jun 2023 04:28 IST

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: వర్జీనియా పొగాకు ధరల్లో పెరుగుదల మొదలైంది. ఎన్‌ఎల్‌ఎస్‌లోని అయిదు పొగాకు వేలం కేంద్రాల్లో సోమవారం మేలు రకం పొగాకుకు కేజీకి అత్యధికంగా రూ.215 ధర లభించింది. ఇప్పటివరకు గరిష్ఠ ధర కేజీ రూ.211. జంగారెడ్డిగూడెంలోని రెండు వేలం కేంద్రాలు, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి కేంద్రాలలో సోమవారం రూ.215 ధర లభించడంతో ఒక్కసారిగా కేజీకి రూ.4 పెరిగింది. గత సీజన్‌లో గరిష్ఠ ధర రూ.245 పలికింది. కర్ణాటకలో ఈ సీజన్‌లోనే గరిష్ఠ ధర రూ.272 లభించింది. ప్రస్తుతం రైతుల వద్ద అధిక శాతం మేలు రకం పొగాకు ఉంది. మేలు రకం పొగాకు ధరల్లో కదలిక రావడంతో రాబోయే రోజుల్లో పొగాకు ధరల్లో మరింత పెరుగుదల ఉండవచ్చునని రైతులు ఆశతో ఎదరు చూస్తున్నారు.  

మూడు కేంద్రాల్లో రూ.200 సగటు..  ధరల పెరుగుదలతో దేవరపల్లి, గోపాలపురం, జంగారెడ్డిగూడెం రెండో వేలం కేంద్రాలలో పొగాకు సగటు ధర రూ.200 దాటింది.

శరవేగంగా కొనుగోళ్లు.. ఎన్‌ఎల్‌ఎస్‌లో పొగాకు కొనుగోళ్లు శరవేగంగా జరుగుతున్నాయి. సోమవారం నాటికి 19.40 మిలియన్‌ కేజీల పొగాకు కొనుగోళ్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది 50 మిలియన్‌ కేజీలు పండి ఉండవచ్చునని అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 40 శాతం పంట కొనుగోళ్లు ఇప్పటికే పూర్తయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని