logo

రైల్వే ప్రయాణికుల భద్రత విస్మరిస్తున్న కేంద్రం: సీపీఎం

కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రయాణికుల భద్రతను విస్మరిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి విమర్శించారు.

Published : 06 Jun 2023 04:28 IST

ఫైర్‌స్టేషన్‌ సెంటరు వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన

ఏలూరు వన్‌టౌన్‌, న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రయాణికుల భద్రతను విస్మరిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి విమర్శించారు. సోమవారం సాయంత్రం ఏలూరు పవర్‌పేట రైల్వేస్టేషన్‌ వద్ద సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఒడిశా కోరమండల్‌ రైలు ప్రమాద మృతులకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర కమిటీ కార్యదర్శి పి.కిశోర్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ సిగ్నలింగ్‌ వ్యవస్థ సక్రమంగా పని చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. రైల్వేశాఖలో లక్షల సంఖ్యలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందన్నారు. నాయకులు రామకృష్ణ, ప్రసాద్‌, ఏసుబాబు, సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

రైలు ప్రమాద మృతులకు నివాళి.. ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాద ఘటనలోని మృతులకు ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ఘన నివాళి అర్పించారు. జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ ఛైర్మన్‌ బీవీ కృష్ణారెడ్డి, నర్సింగ్‌ సిబ్బంది తదితరులు సోమవారం రాత్రి ఏలూరు నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. క్షతగాత్రులను ఆదుకునేందుకు   యువత, రెడ్‌క్రాస్‌ సభ్యులు ముందుకురావడం అభినందనీయమన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని