logo

పరిశోధనలతో కొత్త బాట

వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దిన ఘనత వైఎస్‌ఆర్‌ కుటుంబానికే దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌ రెడ్డి అన్నారు.

Updated : 07 Jun 2023 05:29 IST

కేంద్రీయ గ్రంథాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రులు గోవర్దన్‌రెడ్డి, సత్యనారాయణ

ఉద్యాన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దిన ఘనత వైఎస్‌ఆర్‌ కుటుంబానికే దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌ రెడ్డి అన్నారు. వెంకట్రామన్నగూడెంలోని వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంలో రూ.5 కోట్లతో నిర్మించిన కేంద్రీయ గ్రంథాలయం, ఉద్యాన వేదిక, ఉద్యాన విస్తరణ సేవలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాన్ని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణతో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సమగ్ర జ్ఞాన వనరులను అందించడానికి రూపొందించిన కేంద్రీయ గ్రంథాలయం విద్యార్థులకు వరమన్నారు. వైఎస్‌ఆర్‌ యంత్రసేవా పథకంలో భాగంగా ఒక్కో ఆర్బీకేకి రూ.15 లక్షల విలువైన యంత్ర పరికరాలను అందజేస్తున్నామన్నారు. ఉద్యాన రంగంలో ప్రగతి సాధించడానికి విశ్వవిద్యాలయం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ మండలంలో ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని 2007లో వైఎస్‌ఆర్‌ నిర్ణయం తీసుకుని అదే ఏడాది బడ్జెట్‌ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. విస్తృత పరిశోధనలు చేసి రైతులు ఎక్కువ లాభాలు పొందేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలన్నారు. విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంట రకాలు, పరిశోధనలు, సాంకేతిక పురోగతిని అభివృద్ధి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ఉపకులపతి టి.జానకిరామ్‌ వివరించారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌, సబ్‌ కలెక్టర్‌ సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని