logo

నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి 20న మహాపాదయాత్ర

పోలవరం నిర్వాసితుల సమస్యలు ప్రభుత్వాలకు పట్టడం లేదని, వాటి  పరిష్కారానికి ఈ నెల 20న అల్లూరి సీతారామరాజు జిల్లా నెల్లిపాక నుంచి విజయవాడ వరకు ‘పోలవరం నిర్వాసితుల పోరుకేక మహాపాదయాత్ర’ నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి వెల్లడించారు.

Published : 08 Jun 2023 05:44 IST

మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి రవి

ఏలూరు వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: పోలవరం నిర్వాసితుల సమస్యలు ప్రభుత్వాలకు పట్టడం లేదని, వాటి  పరిష్కారానికి ఈ నెల 20న అల్లూరి సీతారామరాజు జిల్లా నెల్లిపాక నుంచి విజయవాడ వరకు ‘పోలవరం నిర్వాసితుల పోరుకేక మహాపాదయాత్ర’ నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి వెల్లడించారు. ఇక్కడి ఉద్దరాజు రామం భవనంలో బుధవారం   విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ పునరావాస అంశం తమ పరిధిలోకి రాదని కేంద్రం తేల్చిచెప్పిందని, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముంపు సహాయ, పునరావాస చర్యలపై శ్రద్ధ చూపడం లేదన్నారు. ఇందుకు నిధులు కూడా విడుదల చేయకపోవడం దారుణమన్నారు.   ఈ నెల 26న వేలేరుపాడు, కుక్కునూరు, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల్లోని నిర్వాసిత ప్రాంతాలు, కాలనీల్లో పర్యటిస్తామన్నారు. సమావేశంలో నాయకులు కె.శ్రీనివాస్‌, బి.సోమయ్య, కిశోర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని