logo

సర్వేలో వెనుకబడితే చర్యలు: కలెక్టర్‌

జిల్లాలో నిర్వహిస్తున్న ఎన్‌సీడీ సర్వేలో వెనుకబడితే చర్యలుంటాయని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ అధికారులను హెచ్చరించారు.

Published : 08 Jun 2023 05:44 IST

వైద్యకళాశాల నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ప్రసన్న వెంకటేశ్‌

ఏలూరు టూటౌన్‌, కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో నిర్వహిస్తున్న ఎన్‌సీడీ సర్వేలో వెనుకబడితే చర్యలుంటాయని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ అధికారులను హెచ్చరించారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, పీహెచ్‌సీల వైద్యాధికారులతో కలెక్టరేట్‌ నుంచి బుధవారం నిర్వహించిన దూరదృశ్య సమీక్షలో ఆయన మాట్లాడారు.  క్యాన్సర్‌, రక్తహీనత, మధుమేహానికి సంబంధించిన ఎన్‌సీడీ సర్వేను సక్రమంగా చేయాలన్నారు. జిల్లా వైద్యశాఖ ద్వారా వివిధ కొలువుల భర్తీకి సంబంధించిన ప్రక్రియపై సమీక్షించారు. జడ్పీ సీఈవో రవికుమార్‌, డీఆర్‌డీఏ పీడీ విజయరాజు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఆగస్టు 1 నుంచి ఎంబీబీఎస్‌ తరగతులు

ఏలూరు వైద్య కళాశాల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌  అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో నిర్మిస్తున్న మొదటి సంవత్సరం తరగతి గదుల నిర్మాణ పనులు, ఏటిగట్టులో వసతిగృహ నిర్మాణానికి సంబంధించిన భూమి, ప్రభుత్వాసుపత్రిలో నర్సింగ్‌ విద్యార్థుల వసతికి సమకూర్చిన సీఎస్‌ఐ స్కూల్‌ భవనాలను కలెక్టర్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1 నుంచి ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని