logo

ప్రతిభకు ఉపకారం.. చదువుకు సహకారం!

చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ.. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం 2016 నుంచి కేంద్ర ప్రభుత్వం సరోజని దామోదర్‌ ఫౌండేషన్‌ విద్యాదాన్‌ ఉపకార వేతనం అందిస్తోంది.

Published : 09 Jun 2023 05:43 IST

‘విద్యాదాన్‌’ తో విద్యార్థికి ఉజ్వల భవిత

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ.. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం 2016 నుంచి కేంద్ర ప్రభుత్వం సరోజని దామోదర్‌ ఫౌండేషన్‌ విద్యాదాన్‌ ఉపకార వేతనం అందిస్తోంది. కళాశాల విద్యలో సత్తా చాటే వారికి ఈ సాయం ఉపయోగపడనుంది. ఇంటర్మీడియటలో రెండేళ్లతో పాటు డిగ్రీలో విద్యార్థులు ఎంచుకున్న కోర్సు ఆధారంగా ఏడాదికి రూ.10 వేలు నుంచి రూ.60 వేల వరకు అందజేస్తారు.

ఎవరు అర్హులంటే..

* 2022-23 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 90 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. దివ్యాంగులకైతే 75 శాతం మార్కులు చాలు. * కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలు మించకూడదు. * ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో పాటు బాలికలకు ప్రాధాన్యం ఉంటుంది. * ఇంటర్మీడియట, డిప్లొమోలో చేరే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాదికి రూ.10 వేలు ఇస్తారు. ఆ తరువాత ఉన్నత విద్యకు రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు కోర్సును బట్టి అందిస్తారు.

అవసరమైన పత్రాలు

* పదో తరగతి మార్కుల జాబితా, పోస్‌పోర్టు సైజ్‌ ఫొటో, 2023లో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం లేదా రేషన్‌ కార్డు. * ప్రత్యేక ప్రతిభావంతులు అయితే ప్రభుత్వం జారీ చేసిన ధ్రువీకరణ పత్రం. * ఏ కళాశాలలో, ఏ కోర్సులో చేరుతున్నారో దరఖాస్తులో పొందుపరచాలి. * విద్యార్థికి వ్యక్తిగత ఈ మెయిల్‌ ఉండాలి. ఎంపిక వివరాలు ద్వారా పంపుతారు.

15 చివరి తేదీ

ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 15వ తేదీ వరకు అవకాశం ఉంది. జులై 2న ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు www.vidyadhan.org వెబ్‌సైట ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని