శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగోన్నతులు కల్పించాలి : ఫ్యాప్టో
ఉపాధ్యాయులకు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నాయకులు డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ ఏవో రమాదేవికి వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులకు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నాయకులు డిమాండ్ చేశారు. ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ ఇచ్చిన దశల వారీ పోరాటాల్లో భాగంగా మొదటి దశ చివరి రోజైన శుక్రవారం స్థానిక యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఏలూరు జిల్లా ఛైర్మన్ నారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడారు. సెక్రటరీ జనరల్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉపాధ్యాయులపై అనుసరిస్తున్న వైఖరిని మార్చుకోవాలన్నారు. 117 జీవో రద్దు చేయాలని, ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించవద్దని, పీఆర్‌సీ, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏవో రమాదేవికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు ఎస్‌కే రంగావలి, జి.కృష్ణ, రామారావు, రవికుమార్, రెడ్డిదొర, మనోజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.