బడి బస్సు సిద్ధమేనా?
పాఠశాలలు ఈ నెల 12 నుంచి తెరుచుకోనున్నాయి. అయినా బడి బస్సులకు సామర్థ్య పరీక్షలు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తి చేయాల్సి ఉంది.
పూర్తి కాని సామర్థ్య పరీక్షల ప్రక్రియ
భీమవరం అర్బన్, ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: పాఠశాలలు ఈ నెల 12 నుంచి తెరుచుకోనున్నాయి. అయినా బడి బస్సులకు సామర్థ్య పరీక్షలు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాతే అవి రోడ్డెక్కాలి. ఇప్పటికీ ఇంకా ఉభయ జిల్లాల్లో 620 బస్సులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అనధికారికంగా ఆ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశమూ ఉంది.
క్రమం తప్పకుండా ఏటా నిర్వహించాల్సిన బడి బస్సుల సామర్థ్య పరీక్షలు పూర్తి కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా సందర్భాల్లో కండీషన్‌లో లేని బస్సులు నడపటంతో అవి ప్రమాదానికి గురైన సంఘటనలు గతంలో చాలా ఉన్నాయి. ఆయా సమయాల్లో పలువురు విద్యార్థులు క్షతగాత్రులయ్యారు. అలాంటివి జరగకుండా ఉండాలంటే బస్సులు సామర్థ్యం కలిగి ఉన్నాయని రవాణ శాఖాధికారులు నిర్ధరించి ధ్రువ పత్రం ఇవ్వాలి. ఆ తర్వాతే ఆయా బస్సులను విద్యార్థుల కోసం ఉపయోగించాలి.
గతంలో ఇలా
* భీమవరం నుంచి దిర్సుమర్రు వెళ్లే ప్రధాన రహదారిపై వెళ్తున్న ప్రైవేటు విద్యా సంస్థ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఆ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.
* గత ఏడాది యండగండి వద్ద ఒక విద్యాసంస్థ బస్సు స్టీరింగ్ పట్టేయడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఆ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి
* కొన్ని నెలల కిందట విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వెళ్తుండగా వేలివెన్ను-తణుకు మధ్యలో బస్సు ప్రమాదానికి గురైంది. రోడ్డు దాటే సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఇలాంటి ప్రమాదాలకు బస్సుల్లో సామర్థ్యం లేపోవడమే కారణం.
స్వాధీనం చేసుకుంటాం
సామర్థ్య పరీక్షలు చేయించకుండా విద్యా సంస్థల బస్సులు ఎట్టి పరిస్థితుల్లోనూ నడపకూడదు. శనివారం నుంచి ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నాం. సామర్థ్యం లేని బస్సులు నడిపినా, ధ్రువ పత్రాలు లేకపోయినా వెంటనే స్వాధీనం చేసుకుంటాం. కొన్ని సంస్థల బస్సులకు మరమ్మతులు చేయిస్తున్నామని చెబుతున్నారు. వారికి మినహాయింపు ఉంటుంది. కాని పరీక్షలు పూర్తయ్యే వరకు వాటిని ఎక్కడా తిప్పకూడదు. -ఉమామహేశ్వరరావు, జిల్లా రవాణాధికారి, భీమవరం
* భీమవరం మండలం గొల్లవానితిప్ప వద్ద ఖాళీ స్థలంలో నిలిపి ఉంచిన పాఠశాల బస్సులో నుంచి మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో పిల్లలెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇదే మార్గంలో గతంలో ఒక విద్యాసంస్థ బస్సు అదుపుతప్పి రోడ్డు అంచులో నిలిచిపోయింది. పక్కనే పెద్ద ఎత్తున తాటిచెట్లు ఉండటంతో అది అక్కడితో ఆగిపోయింది. వెంటనే విద్యార్థులను కిందికి దింపి వేరే బస్సులో పంపించారు.* భీమవరం మండలం గొల్లవానితిప్ప వద్ద ఖాళీ స్థలంలో నిలిపి ఉంచిన పాఠశాల బస్సులో నుంచి మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో పిల్లలెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇదే మార్గంలో గతంలో ఒక విద్యాసంస్థ బస్సు అదుపుతప్పి రోడ్డు అంచులో నిలిచిపోయింది. పక్కనే పెద్ద ఎత్తున తాటిచెట్లు ఉండటంతో అది అక్కడితో ఆగిపోయింది. వెంటనే విద్యార్థులను కిందికి దింపి వేరే బస్సులో పంపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
kushboo: ‘ఆ దేవుడే నన్ను ఎంచుకున్నారు’..: ఖుష్బూ
-
NewsClick Raids: ‘న్యూస్‌క్లిక్’పై సోదాలు.. మీడియా స్వేచ్ఛపై అమెరికా కీలక వ్యాఖ్యలు
-
Vande Bharat Sleeper: వందే భారత్‌లో స్లీపర్ కోచ్‌లు.. ఫొటోలు షేర్ చేసిన కేంద్ర మంత్రి
-
Anushka Sharma: అనుష్క శర్మ రెండోసారి తల్లి కానుందంటూ వార్తలు.. నటి ఇన్‌స్టా స్టోరీ వైరల్..!
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India-Canada: భారత్‌తో తెరవెనుక చర్చలను కొనసాగిస్తాం: కెనడా