logo

బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వద్దు

జడ్పీ ఉద్యోగులు సమర్థంగా విధులు నిర్వహించాలని, ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని జడ్పీ ఛైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీ అన్నారు. జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఆమె అధికారులు, ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు.

Published : 10 Jun 2023 03:36 IST

జడ్పీ ఛైర్‌పర్సన్‌

మాట్లాడుతున్న పద్మశ్రీ

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: జడ్పీ ఉద్యోగులు సమర్థంగా విధులు నిర్వహించాలని, ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని జడ్పీ ఛైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీ అన్నారు. జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఆమె అధికారులు, ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌ బిల్లులపై ఆరా తీశారు. సీ సెక్షన్‌లో 50, మరో సెక్షన్‌లో 15 బిల్లులు పెండింగులో ఉన్నాయని ఆయా విభాగాల ఉద్యోగులు వివరించగా.. ఇన్ని బిల్లులు ఎందుకు పెండింగులో ఉంటున్నాయని ప్రశ్నించారు. బిల్లులు ఆన్‌లైన్‌ చేయడానికి ఎందుకు జాప్యం జరుగుతోందన్నారు. ఆన్‌లైన్‌ చేయాలంటే స్క్రూటిని జరగాలని, సంబంధిత ఏవో బదిలీపై వెళ్లడంతో ప్రక్రియ ఆగిందని సిబ్బంది ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్‌ మాట్లాడుతూ బిల్లులు వేరే సెక్షన్‌ ఏవోకు అప్పగించాలని, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని సీఈవోను ఆదేశించారు. కారుణ్య నియామకాలు ఈ నెల 15 నాటికి పూర్తి చేయాలన్నారు. ఏవోలుగా ఉద్యోగోన్నతులు పొందడానికి అర్హత కలిగిన సీనియర్‌ అసిస్టెంట్లు ఈ నెల 12న తనతో భేటీ కావాలని సూచించారు. జడ్పీ సీఈవో రవికుమార్‌, సంబంధిత సెక్షన్ల ఏవోలు పాల్గొన్నారు. *  జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్‌గా  బాధ్యతలు చేపట్టిన గంటా పద్మశ్రీ శుక్రవారం తాడేపల్లిలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ సూర్యకుమారిని మర్యాదపూర్వకంగా కలిసి జిల్లా అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని