logo

ఈదురు గాలుల బీభత్సం

పెదవేగి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. చెట్లు విరిగి విద్యుత్తు తీగలు, కండక్టర్లపై పడటంతో సరఫరా నిలిచిపోయింది.

Published : 10 Jun 2023 03:36 IST

కొవ్వలిలో నేలకొరిగిన చెట్లు

పెదవేగి, దెందులూరు, చాట్రాయి, న్యూస్‌టుడే: పెదవేగి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. చెట్లు విరిగి విద్యుత్తు తీగలు, కండక్టర్లపై పడటంతో సరఫరా నిలిచిపోయింది. విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టామని ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్‌ తెలిపారు. లక్ష్మీపురంలో కొబ్బరిచెట్లు నేలకొరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దెందులూరు మండలంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. కొవ్వలిలో ఓ ఇంటి రేకులు ఎగిరిపోయాయి. గ్రామంలో నాలుగు స్తంభాలు పడిపోయాయని విద్యుత్తు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. గాలాయగూడెంలో వ్యవసాయ విద్యుత్తు ఫీడర్‌ స్తంభం పడిపోయినట్లు అధికారులు తెలిపారు. బీ చాట్రాయి మండలం తుమ్మగూడెంలో ఈదురు గాలులకు జాహేద్‌ హుస్సేన్‌కు చెందిన కోళ్ల షెడ్డు కూలిపోయింది.  అందులోని కోళ్లన్నీ చనిపోయాయని యజమాని చెప్పారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని