ఆర్భాటంగా చెప్పారు.. అతీగతీ లేదు
నరసాపురంలో రూ.3300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలంటే నియోజకవర్గ రూపులేఖలే మారిపోతాయని ప్రజలు సంబరపడ్డారు. సీˆఎం ఆర్బాటంగా శంకుస్థాపనలు చేయడంతో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తవుతాయని భావించారు.
ప్రచారమే తప్ప ఇప్పటికీ అడుగు పడని పనులెన్నో
ఈనాడు, ఏలూరు, న్యూస్‌టుడే, నరసాపురం

నరసాపురంలో రూ.3300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలంటే నియోజకవర్గ రూపులేఖలే మారిపోతాయని ప్రజలు సంబరపడ్డారు. సీˆఎం ఆర్బాటంగా శంకుస్థాపనలు చేయడంతో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తవుతాయని భావించారు. సరిగ్గా ఏడాది గడిచినా అడుగులు పడలేదు. అప్పుడు శంకుస్థాపన చేసిన ఫిషింగ్ హార్బర్, ఆక్వా యూనివర్సిటీ మొదలు భూగర్భ డ్రెయినేజీ వరకు ఒక్కటంటే ఒక్క పని కూడా పూర్తి కాలేదు. ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఆక్వా విశ్వవిద్యాలయానికి రహదారుల నిర్మాణం తప్ప ఇంకే పనులూ చేయలేదు. రూ.1400 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకానికి శంకుస్థాపన చేసి ఏడాది గడిచినా ఇప్పటి వరకు అతీగతీలేదు.
ఒకే రోజు సుమారు రూ.3300 కోట్ల నిధులతో 15 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నాం. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం నరసాపురం చరిత్రలో మునుపెన్నడూ జరిగిన దాఖలాలు లేవు. నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు జరుగుతున్న గొప్ప ప్రయత్నమిది.
గతేడాది నవంబరు 21న నరసాపురం బహిరంగ సభలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలివి.
వియర్ ఛానల్‌కు అంతరాయం.. మొగల్తూరు మండలంలో చివరి ప్రాంతాల ఆయకట్టుకు సాగునీరు తరలించేందుకు రూ.24 కోట్ల వ్యయంతో వియర్ ఛానల్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. మొగల్తూరు-పేరుపాలెం మధ్య ఏర్పాటు చేసే ఈ కాలువతో దాదాపు 2వేల ఎకరాలకు సాగునీరు అందించొచ్చు. ఈ పనులు ఇప్పటి వరకు మొదలు కాలేదు.
టెండర్లు దాటని స్లూయిజ్‌ల నిర్మాణం
స్లూయిజ్‌లు శిథిలావస్థకు చేరటంతో వరదల సమయంలో పొలాలు ముంపునకు గురై వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతోంది. దీని నివారణకు రూ.9 కోట్ల అంచనా వ్యయంతో నియోజకవర్గంతో కాజ, ఈస్ట్‌కుక్కులేరు, ముస్కేపాలెం, మడుగుతోములు ప్రాంతాల్లో స్లూయిజ్‌ల ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులకు మూడుసార్లు టెండర్లు పిలిచినా ఒక్క గుత్తేదారు కూడా ముందుకు రాలేదు.
వశిష్ఠ వారధి జాడేది
నరసాపురం, మొగల్తూరు మండలాలను కోనసీమతో అనుసంధానం చేసేందుకు రూ.26 కోట్ల అంచనాతో వశిష్ఠవారధి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గోదావరి నదిపై గాజులలంక సమీపంలో వంతెనతోపాటు రహదారులు నిర్మించాల్సి ఉంది. దీంతో చుట్టూ తిరిగి చించినాడ వంతెన మీదుగా, లేకుంటే నరసాపురం నుంచి పంటు మీదుగా వెళ్లకుండా ఈ వంతెన మీదుగా సరాసరి సఖినేటిపల్లి, మల్కిపురం, రాజోలు వెళ్లేందుకు సులువుగా ఉంటుంది. దీంతో రెండు జిల్లాల్లోని గోదావరి తీరంలోని ప్రజలకు ఉపయోగం. ఏడాది గడిచినా వంతెన పనులు పట్టాలెక్కలేదు. గుత్తేదారులు ముందుకు రాకపోవటంతో టెండర్ల దశలోనే నిలిచింది.
భూగర్భ డ్రెయినేజీ ఎక్కడ
నరసాపురంలో చిన్న వర్షం కురిసినా డ్రెయినేజీలు పొంగి ఇళ్లలోకి నీరు వస్తోంది. 31 వార్డుల ప్రజలు వర్షాకాలంలో నరకం చూస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి సీఎం రూ.85కోట్లతో భూగర్భ డ్రెయినేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు ఆ పనులకు ప్రతిపాదనలు కూడా సిద్ధం కాలేదు.
రెగ్యులేటర్లను గాలికొదిలేశారు..
సముద్రపు నీరు కొల్లేరులో చొరబడకుండా నిరోధించి..5వ కాంటూరు వరకు మంచి నీరు నిల్వ చేయడానికి ఉప్పుటేరుపై మోళ్లపర్రు పరిధిలో రూ.188.40 కోట్ల అంచనా వ్యయంతో రెగ్యులేటర్, వంతెన, లాక్ నిర్మాణానికి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఏడాది గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. మూడుసార్లు టెండర్లు పిలిచినా ఒక్క గుత్తేదారు కూడా ముందుకు రాలేదు.
ఫిషింగ్ హార్బర్ ఏది సార్..
బియ్యపుతిప్ప దగ్గర రూ.429.43 కోట్ల అంచనాతో పై చిత్రంలోని ప్రాంతంలో ఫిసింగ్ హార్బర్ నిర్మించాల్సి ఉండగా.. ఒక్క ఇటుక కూడా పడలేదు. దీని ద్వారా అత్యంత సామర్థ్యం కలిగిన మోటారు బోట్లలో సముద్రంలో ఎక్కువ దూరం వెళ్లి వేట సాగించేందుకు వీలుంటుంది. నరసాపురం మొగల్తూరు మండలాల్లో దాదాపు ఆరువేల మందికి లబ్ధి చేకూరుతుంది.
విద్యుత్తు ఉపకేంద్రానికి స్థల గండం..
గతేడాది నవంబరు 21న శంకుస్థాపన శిలాఫలకాల వద్ద సీఎం తదితరులు
రుస్తుంబాదలో 220/132/33 కేవి విద్యుత్తు ఉపకేంద్రం పనులు స్థల సేకరణ దశలోనే ఆగిపోయాయి. 26కి 6.5 ఎకరాల స్థలమే సేకరించడంతో నిర్మాణ ప్రక్రియ నిలిచిపోయింది. నరసాపురంలో ఉపకేంద్రం నుంచి సరఫరాలో హెచ్చుతగ్గులు, కోతలతో ప్రజలతో పాటు వరి, ఆక్వా రైతులు, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. ఇది పూర్తయితే నాలుగు మండలాలతో పాటు ఆక్వా విశ్వవిద్యాలయానికి కూడా ఇక్కడి నుంచే విద్యుత్తు సరఫరా చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్నద్ధత లేక.. నిండా మునక!
[ 09-12-2023]
-
ఇంకెన్నాళ్లిలా?
[ 09-12-2023]
నూజివీడుకు చెందిన వేణుగోపాలరావు 35 సంవత్సరాలపాటు ప్రభుత్వ ఉద్యోగం చేసి ఆరేళ్ల కిందట విరమణ పొందారు. వయసు పైబడిన తర్వాత అనారోగ్యం బారినపడ్డారు. ఆయన ప్రతినెలా ఒకటో తేదీ కోసం ఎదురు చూస్తుంటారు. -
ధాన్యంలో తేమ శాతానికి సడలింపులు
[ 09-12-2023]
ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టరేట్ నుంచి శుక్రవారం నిర్వహించిన వీడియో సమావేశంలో ధాన్యం కొనుగోళ్లు, రీసర్వే, ఆడుదాం ఆంధ్రా, స్వమిత్వ, ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ, గృహ నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. -
పీజీ, పీహెచ్డీ ప్రవేశాలకు కౌన్సెలింగ్
[ 09-12-2023]
వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో పీజీ, పీహెచ్డీ ప్రవేశాలకు స్థానిక ఉద్యాన కళాశాలలో శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. -
క్యాటరింగ్ లోపాలు సరిచేస్తాం
[ 09-12-2023]
ఆర్జీయూకేటీ పరిధిలో క్యాటరింగ్ విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేస్తామని కులపతి ఆచార్య కేసీరెడ్డి తెలిపారు. -
యువ చైతన్యంతోనే భవిత
[ 09-12-2023]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధం లాంటిది. ప్రతి ఒక్కరూ ఓటుతో సమర్థ నాయకత్వాన్ని ఎన్నుకుంటేనే బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయి. -
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: నిమ్మల
[ 09-12-2023]
తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.25 వేలు చొప్పున పరిహారం అందించాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రభుత్వాన్ని కోరారు. -
హామీ అమలులో సీఎం విఫలం
[ 09-12-2023]
ఎన్నికలకు ముందుకు అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విఫలమయ్యారని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.భీమారావు విమర్శించారు. -
మంచం లేదని.. అర్ధరాత్రి గెంటేశారు!
[ 09-12-2023]
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన ఓ రోగి విషయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అతడు ప్రాణాలు వదిలిన విషాద సంఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. -
దొంగతనాల కేసులో నిందితుల అరెస్టు
[ 09-12-2023]
పెనుగొండ, పెనుమంట్ర, పాలకొల్లు గ్రామీణ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 8 లక్షల విలువైన చోరీ సొత్తు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు నరసాపురం డీఎస్పీ జీవీఎస్ పైడేశ్వరరావు తెలిపారు. -
ఒడ్డుకు చేర్చేందుకు.. భగీరథ యత్నాలు
[ 09-12-2023]
తుపాను ప్రభావంతో దెబ్బతినగా మిగిలిన పంటను ఒడ్డుకు చేర్చేందుకు అన్నదాతలు భగీరథ యత్నాలు చేస్తున్నారు. రెండు రోజులుగా వాతావరణం పొడిగా ఉన్నా డ్రెయిన్లు బిగదన్నడంతో చేలల్లో నిలిచిన నీరు బయటకు వెళ్లడం లేదు. -
జీతమిక్కడ.. విధులక్కడ
[ 09-12-2023]
ఆకివీడు తహసీల్దార్ గురుమూర్తిరెడ్డి పెనుగొండలో పనిచేస్తున్నారు. జీతం ఆకివీడు నుంచే తీసుకుంటున్నారు. నరసాపురం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న విజయలక్ష్మి ఆకివీడు తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. -
వివాదాస్పదమైన కుటుంబ వైద్య శిబిరం
[ 09-12-2023]
ప్రచార ఆర్భాటం ఎక్కువగా ఉన్న ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరాల్లో ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం ఆచంట మండలం కొడమంచిలి గ్రామంలో వల్లూరు వైద్యాధికారి వేణుబాబు, స్థానిక సర్పంచి సుంకర సీˆతారామ్ మధ్య వివాదం చోటు చేసుకుంది.


తాజా వార్తలు (Latest News)
-
Supreme Court: జడ్జీలు తీర్పుల్లో ఉపదేశాలివ్వరాదు: సుప్రీం
-
ఉత్తరాది రాష్ట్రాలది గోముద్ర!: డీఎంకే ఎంపీ వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై స్పందన
-
AB de Villiers: అందుకే త్వరగా ఆటకు వీడ్కోలు పలికా: ఏబీడీ
-
TS News: మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు!
-
పొరపాటున పేలిన ఎస్.ఐ. తుపాకీ.. మహిళ తలలోకి దూసుకెళ్లిన తూటా
-
Anganwadi Vacancy: తెలంగాణలో 8,815 అంగన్వాడీ పోస్టులు ఖాళీ