logo

సంక్రాంతి నుంచి మావుళ్లమ్మ ఉత్సవాలు

భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయ 58వ వార్షిక మహోత్సవాలకు బుధవారం మధ్యాహ్నం పందిరి రాట వేసి అంకురార్పణ చేశారు. నీరుల్లి, కూరగాయ, పండ్ల వర్తక సంఘం మాజీ అధ్యక్షుడు రామాయణం గోవిందరావుతో ప్రధానార్చకుడు మద్దిరాల

Published : 09 Dec 2021 04:46 IST

పందిరి రాట పూజలో వర్తక సంఘం సభ్యులు, ప్రధానార్చకుడు

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయ 58వ వార్షిక మహోత్సవాలకు బుధవారం మధ్యాహ్నం పందిరి రాట వేసి అంకురార్పణ చేశారు. నీరుల్లి, కూరగాయ, పండ్ల వర్తక సంఘం మాజీ అధ్యక్షుడు రామాయణం గోవిందరావుతో ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జునశర్మ పూజలు చేయించారు. వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి రోజు నుంచి 30 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. వర్తక సంఘం నాయకులు కొప్పుల సత్తిబాబు, కొప్పుల రంగారావు, నరహరిశెట్టి అబ్బులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని