logo
Published : 07/12/2021 04:37 IST

పోలీసు ప్రతిష్ఠనుమరింత పెంచండి: డీఐజీ

గౌరవ వందనం స్వీకరిస్తున్న మోహనరావు, పక్కన పోలీసు అధికారులు

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: హోంగార్డులు సమాజానికి మెరుగైన సేవలందిస్తున్నారని, వారి సేవలు అమూల్యమని ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహనరావు అన్నారు. మరింత బాగా పనిచేసి పోలీసు ప్రతిష్ఠను పెంచాలన్నారు. హోంగార్డుల దినోత్సవాన్ని ఏలూరులోని పోలీసు మైదానంలో సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మోహనరావు మాట్లాడుతూ కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా సేవలందించారన్నారు. కానిస్టేబుళ్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న హోంగార్డులకు ఐదేళ్ల వయసు సడలింపు ఇస్తున్నామన్నారు. ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డులను ఆదుకునేందుకు ఒకరోజు వేతనాన్ని వారు స్వచ్ఛందంగా అందిస్తున్నారన్నారు. క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించారు.

మైదానంలో కవాతు చేస్తున్న హోంగార్డులు

Read latest Westgodavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని