logo

‘ఎస్సీలపై దాడులు చేస్తే సహించం’

ఎస్సీలపై దాడులు చేస్తే సహించబోమని ఎస్సీ కమిషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ మారుమూడి విక్టర్‌ప్రసాద్‌ హెచ్చరించారు. అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని కాళ్ల మండలం ఏలూరుపాడులో సోమవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత

Published : 07 Dec 2021 04:37 IST


అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మాట్లాడుతున్న విక్టర్‌ ప్రసాద్‌

ఏలూరుపాడు (ఉండి),న్యూస్‌టుడే: ఎస్సీలపై దాడులు చేస్తే సహించబోమని ఎస్సీ కమిషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ మారుమూడి విక్టర్‌ప్రసాద్‌ హెచ్చరించారు. అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని కాళ్ల మండలం ఏలూరుపాడులో సోమవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహాలను కొన్ని చోట్ల ఊరికి దూరంగా ఏర్పాటు చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. రాజ్యాంగంలో అంబేడ్కర్‌ పొందుపరిచిన అంశాలతో మహిళలకు ఎక్కువ లబ్ధి చేకూరిందన్నారు. గత నెలలో ఏలూరుపాడులో దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. అర్హులైనప్పటికీ ఎస్సీ ధ్రువీకరణపత్రాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటోందని హెచ్చరించారు. తొలుత ఆయన అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త గోకరాజు రామరాజు, బహుజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కోనా జోనఫ్‌, సర్పంచి భూపతిరాజు వెంకట జగ్గరాజు, ఎంపీటీసీ సభ్యుడు సీహెచ్‌ రాంబాబు, అనిత పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని