logo

కాల్పుల కేసు విచారణ ప్రారంభం

కృష్ణా జిల్లా పెద అవుటపల్లిలో కాల్పుల కేసు ఘటనపై సోమవారం విజయవాడ ఏడో అదనపు జిల్లా న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. 2014, సెప్టెంబరు 24న నాగేశ్వరరావు, మారయ్య, పగిడి మారయ్య అనే ముగ్గురు వ్యక్తులు ఓ హత్య కేసులో

Published : 07 Dec 2021 04:43 IST

48 మందిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

విజయవాడ న్యాయవిభాగం, న్యూస్‌టుడే : కృష్ణా జిల్లా పెద అవుటపల్లిలో కాల్పుల కేసు ఘటనపై సోమవారం విజయవాడ ఏడో అదనపు జిల్లా న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. 2014, సెప్టెంబరు 24న నాగేశ్వరరావు, మారయ్య, పగిడి మారయ్య అనే ముగ్గురు వ్యక్తులు ఓ హత్య కేసులో ఏలూరు న్యాయస్థానానికి హాజరవుతుండగా.. మార్గం మధ్యలో కృష్ణా జిల్లా పెదఅవుటపల్లిలో కొందరు వారిని వెంబడించి తుపాకీతో కాల్చి చంపారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటనపై తూర్పు జోన్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలానికి చెందిన నిందితుడు భూతం శ్రీనివాసరావుతో పాటు మొత్తం 48 మందిని నిందితులుగా గుర్తించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణ నిమిత్తం వారందరినీ పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో సోమవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. సోమవారం మొదటి సాక్షి సాక్ష్యాన్ని న్యాయస్థాన ఏపీపీ లాం చిన ఇశ్రాయేల్‌ న్యాయస్థానంలో నమోదు చేయించారు. ఈ కేసులో మొత్తం 174 మంది సాక్షులను విచారించనున్నారు. విచారణ నేపథ్యంలో న్యాయస్థానాల ప్రాంగణంలో ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి లోపలికి అనుమతించారు. నిందితులు న్యాయస్థానంలో ఉన్నంత సేపు పోలీస్‌ పహారా కొనసాగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని