logo

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రైవేటు బస్సు

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనటంతో దానిపై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరు మృతిచెందగా ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. ఏలూరు పాతబస్టాండ్‌ సెంటరు వద్ద బుధవారం అర్ధ రాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు

Published : 21 Jan 2022 05:20 IST

ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనటంతో దానిపై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరు మృతిచెందగా ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. ఏలూరు పాతబస్టాండ్‌ సెంటరు వద్ద బుధవారం అర్ధ రాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ సమీపంలోని పోరంకికి చెందిన కాండ్రు దుర్గారావు అనే యువకుడు ఇటీవల సంక్రాంతికి ఏలూరు మండలం పోణంగిలోని తమ బంధువుల ఇంటికి వచ్చాడు. తమ బంధువులైన మరో ఇద్దరు యువకులు కాకొర్ల దుర్గారావు, మత్తి ఆదినారాయణతో కలిసి పోరంకి నుంచి వచ్చిన కాండ్రు దుర్గారావు ద్విచక్ర వాహనంపై ఏలూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌కు వచ్చారు. బుధవారం అర్ధ రాత్రి దాటాక రైల్వేస్టేషన్‌ నుంచి పాత బస్టాండ్‌ వైపు వచ్చే ఫ్లైఓవరు మీదుగా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ పోణంగి వెళ్లేందుకు పాతబస్టాండ్‌ కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా విజయవాడ నుంచి విజయనగరం వెళ్తున్న ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో ముగ్గురూ తీవ్ర గాయాలపాలయ్యారు. అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న టూటౌన్‌ ఎస్సై నాగబాబు, సిబ్బంది క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పోణంగికి చెందిన కాకొర్ల దుర్గారావు (23) మృతిచెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ముగ్గురూ కూలి పనులు చేస్తుంటారు. టూటౌన్‌ ఎస్సై ఎన్‌ఆర్‌ కిషోర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని