logo

‘నాడు-నేడు’తో పాఠశాలల అభివృద్ధి: మంత్రి

‘నాడు-నేడు’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. పెదవేగిలోని గురుకుల బాలుర పాఠశాలలో బాలుర, బాలికల క్రీడా పాఠశాలలను గురువారం ఆయన ప్రారంభించారు.

Published : 21 Jan 2022 05:20 IST

క్రీడాకారులతో కబడ్డీ ఆడుతున్న విశ్వరూప్‌

పెదవేగి, న్యూస్‌టుడే: ‘నాడు-నేడు’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. పెదవేగిలోని గురుకుల బాలుర పాఠశాలలో బాలుర, బాలికల క్రీడా పాఠశాలలను గురువారం ఆయన ప్రారంభించారు. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన శిక్షణను పెదవేగిలోని గురుకుల పాఠశాలలో బాలురకు, పొలసానిపల్లిలో బాలికలకు క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్రీడా పాఠశాలలను ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, పుప్పాల వాసుబాబు, ఉన్నమట్ల ఎలీజాలతో క్రీడాజ్యోతి వెలిగించి మంత్రి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి వాలీబాల్‌, కబడ్డీ ఆడి వారిని ప్రోత్సహించారు. కార్యక్రమంలో జేసి పద్మావతి, రాష్ట్ర గురుకుల విద్యాలయ సమితి సంయుక్త కార్యదర్శి ఎన్‌.సంజీవరావు, గురుకుల విద్యాలయ సమితి క్రీడా కో ఆర్డినేటర్‌ కందికొండ జయరాజు, పెదవేగి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ నేతల శ్యామ్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని