logo

సచివాలయ సిబ్బందికి ఏకరూప దుస్తులు

ప్రభుత్వం సచివాలయ సిబ్బందికి ఏకరూప దుస్తులు ప్రవేశపెట్టింది. వచ్చేనెల నుంచి వీటిని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. లైట్‌బ్లూ - గోధుమ రంగులుగా నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాలకు గురువారం విజయవాడ

Published : 21 Jan 2022 05:20 IST

తాడేపల్లిగూడెం కార్యాలయంలో ఉంచిన దుస్తులు

తాడేపల్లిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వం సచివాలయ సిబ్బందికి ఏకరూప దుస్తులు ప్రవేశపెట్టింది. వచ్చేనెల నుంచి వీటిని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. లైట్‌బ్లూ - గోధుమ రంగులుగా నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాలకు గురువారం విజయవాడ నుంచి వ్యాన్లలో తీసుకువచ్చి అందజేశారు. ఒక్కొక్కరికి మూడు జతలు చొప్పున ఉచితంగా అందిస్తున్నారు. వీటిని సిబ్బంది కుట్టించుకోవాలి. జనవరి 26 నాటికి ఏకరూప దుస్తులు తొలిప్రయత్నంగా అమలు చేయాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. ఈ మేరకు సుమారు 10,332 మంది సిబ్బందికి వీటి పంపిణీ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని