logo

ప్రతి ఎకరాకూ నీరందిస్తాం: కలెక్టర్‌

రబీలో ప్రతి ఎకరాకు సాగు నీరందించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు. గురువారం ఆయన పెంటపాడు మండలం పరిమెళ్ల లాకులు, గణపవరం మండలంలోని చిలకంపాడు లాకుల వద్ద సాగునీటిని అధికారులతో

Published : 21 Jan 2022 05:20 IST

పరిమెళ్ల లాకుల వద్ద సాగునీటి పరిశీలిస్తున్న కార్తికేయ మిశ్రా

పెంటపాడు, న్యూస్‌టుడే: రబీలో ప్రతి ఎకరాకు సాగు నీరందించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు. గురువారం ఆయన పెంటపాడు మండలం పరిమెళ్ల లాకులు, గణపవరం మండలంలోని చిలకంపాడు లాకుల వద్ద సాగునీటిని అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఏఏ ప్రాంతాల్లో వరినాట్లు పూర్తయ్యాయో గుర్తించి నీరందించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. వంతుల వారీ విధానంలో ప్రతి ఎకరాకు కచ్చితంగా నీరందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జేసీ అంబేడ్కర్‌, జలవనరులశాఖ ఎస్‌ఈ దక్షిణామూర్తి, ఈఈ ఎస్‌.రామకృష్ణ, డీఈ ఏవీ వెంకటేశ్వరరావు, వ్యవసాయశాఖ జేడీ ఎం.జగ్గారావు, ఏడీఏ పి.మురళీకృష్ణ, ఏవో పార్థసారథి, తహశీల్దార్‌ శేషగిరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు