logo

బిడ్డపోయి బాధలో ఉంటే డబ్బులడుగుతున్నారు

శిశువు మృతిచెంది తాము బాధలో ఉంటే... అంతిమ సంస్కారానికి ఆసుపత్రి సిబ్బంది నగదు డిమాండ్‌ చేస్తున్నారని రోగి బంధువులు వాపోయారు. ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ సమావేశానికి వచ్చిన జిల్లా కలెక్టర్‌

Published : 21 Jan 2022 05:20 IST

రాజమహేంద్రవరం వైద్యం, న్యూస్‌టుడే: శిశువు మృతిచెంది తాము బాధలో ఉంటే... అంతిమ సంస్కారానికి ఆసుపత్రి సిబ్బంది నగదు డిమాండ్‌ చేస్తున్నారని రోగి బంధువులు వాపోయారు. ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ సమావేశానికి వచ్చిన జిల్లా కలెక్టర్‌ సి.హరికిరణ్‌కు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లుకు చెందిన సానబోయిన మాధవలక్ష్మికి నెలలు నిండడంతో రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు పరీక్షించి మృతశిశువు అని తేలడంతో శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు. శిశువును తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు చేసేందుకు ఆసుపత్రి సిబ్బంది రూ.3 వేలు డిమాండ్‌ చేశారని మాధవలక్ష్మి బంధువు గురువారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తాము డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామన్నా వినిపించుకోకుండా శిశువును అలాగే వదిలేశారన్నారు. ఎవరినైనా అడిగి తరువాత డబ్బులు ఇస్తామన్నా సిబ్బంది తమపై దయ చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని