logo

విద్యుత్తు ధరలపై రేపటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 2022-23 ఆర్థి.క సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్‌ ధరలపై మూడు రోజుల పాటు బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని పర్యవేక్షక ఇంజినీరు

Published : 23 Jan 2022 03:53 IST

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 2022-23 ఆర్థి.క సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్‌ ధరలపై మూడు రోజుల పాటు బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని పర్యవేక్షక ఇంజినీరు ఎస్‌.జనార్దనరావు శనివారం తెలిపారు. ఏలూరులోని విద్యుత్తు భవన్‌లో, తాడేపల్లిగూడెం, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, భీమవరం, నరసాపురంలలో కార్యనిర్వాహక ఇంజినీర్‌ కార్యాలయాల్లో ఈనెల 24, 25, 27 తేదీల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు. విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించే ఈ కార్యక్రమంలో అన్ని డిస్కమ్‌ల టారిఫ్‌ ఫైలింగ్‌కు సంబంధించి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం స్థానిక విద్యుత్తు సర్కిల్‌, డివిజన్‌ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు. ముందుగా నమోదు చేసుకున్నవారి అభ్యంతరాలు విన్న తరువాత విద్యుత్తు నియంత్రణ మండలి అనుమతితో ఇతరుల అభిప్రాయాలు వింటారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని