logo

పీఆర్సీతో ఉద్యోగ, కార్మికులకు నష్టం

ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీ ఉద్యోగ, కార్మికులకు నష్టదాయకమైందని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు విమర్శించారు. ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఏలూరు యూనిట్‌ సమావేశం

Updated : 23 Jan 2022 06:33 IST

నినాదాలు చేస్తున్న కార్మిక నాయకులు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీ ఉద్యోగ, కార్మికులకు నష్టదాయకమైందని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు విమర్శించారు. ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఏలూరు యూనిట్‌ సమావేశం శనివారం నిర్వహించారు. సమావేశానికి యూనియన్‌ అధ్యక్షుడు పుప్పాల కన్నబాబు అధ్యక్షత వహించారు. ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు పుప్పాల కన్నబాబు, కార్యదర్శి భజంత్రీల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏలూరు నగరపాలకసంస్థ కార్మికులకు ఇవ్వాల్సిన ఏకరూపదుస్తుల కోసం దశలవారీ ఆందోళనలు చేపడతామన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ కోశాధికారి పుచ్చ శంకర్, ఉపాధ్యక్షుడు బంగారు దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని