logo

కొవిడ్‌ వేళసంక్షేమనికి ప్రాధాన్యం

కొవిడ్‌ పరిస్థితుల్లోనూ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అన్నారు. గణంతంత్ర వేడుకలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏలూరు పోలీసు పరేడ్‌ మైదానంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వంద

Updated : 27 Jan 2022 06:02 IST

ఘనంగా గణతంత్ర వేడుకలు

జాతీయ పతాకానికి గౌరవ వందనం చేస్తున్న కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ, డీఐజీ మోహనరావు

కొవిడ్‌ పరిస్థితుల్లోనూ ప్రభుత్వం కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అన్నారు. గణంతంత్ర వేడుకలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏలూరు పోలీసు పరేడ్‌ మైదానంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.పోలీసు కవాతును పరిశీలించారు. జిల్లా ప్రగతిని వివరిస్తూ ప్రసంగించారు. జిల్లా జడ్జి భీమారావు, ఎమ్మెల్సీ సాబ్జీ, ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహనరావు, ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ, జేసీలు హిమాన్షు శుక్లా, అంబేడ్కర్‌, శిక్షణ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, ఏలూరు అర్బన్‌

ఉత్తమ శాఖలకు రోలింగ్‌ షీల్డ్స్‌.. వివిధ శాఖల ప్రగతి, పనితీరు ఆధారంగా రోలింగ్‌ షీల్డ్‌లను అందజేశారు. పంచాయతీరాజ్‌, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య శాఖలకు ప్రథమ, ద్వితీయ, స్థానాలు లభించాయి. ఏలూరు మండలం శనివారపుపేట, అత్తిలి సచివాలయాలకు రోలింగ్‌ షీల్డ్‌లను అందజేశారు. రెవెన్యూ శాఖలో ఉత్తమ అధికారిణిగా ఆర్డీవో పి.రచన, పోలీసు శాఖలో కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్‌, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావులకు ఉత్తమ అధికారులుగా పురస్కారాలను అందజేశారు. పోలీసు కవాతులో ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన స్కాట్‌లాండ్‌ బ్యాగ్‌పైపర్‌ బృందానికి బహుమతి అందజేశారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన స్టాళ్లను ప్రదర్శించారు. ఆయా పథకాల లబ్ధిదారులకు ఉపకరణాలను పంపిణీ చేశారు.

త్యాగధనుల జీవితాలు స్ఫూర్తిదాయకం.. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల జీవితాలు స్ఫూర్తిదాయకమని డీఐజీ మోహనరావు అన్నారు. స్థానిక డీఐజీ విడిది కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని డీఐజీ ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఏఎస్పీ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. ● స్థానిక ఎస్పీ విడిది కార్యాలయంలో ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. త్యాగధనుల కృషితోనే స్వాతంత్య్రం.. ● ఎంతోమంది త్యాగధనులు చేసిన కృషివల్లే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని జిల్లా జడ్జి భీమారావు అన్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ పతాకాన్ని భీమారావు ఎగురవేసి గౌరవ వందనం చేశారు. జిల్లా అదనపు జడ్జి టి.మల్లికార్జునరావు, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి వి.శ్రీనివాసులు, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి బాలకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ● తాడేపల్లిగూడెం ఏపీ నిట్‌ ప్రాంగణంలో డైరెక్టర్‌ సీఎస్ఫీరావు జెండా ఆవిష్కరించారు.

కవాతు చేస్తున్న పోలీసులు

ప్రగతిని ప్రతిబింబించిన శకటాలు.. జిల్లా అభివృద్ధిని ప్రతిబింబించేలా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు. వైద్య, ఆరోగ్య శాఖ, గృహ నిర్మాణ సంస్థ, వ్యవసాయ శాఖలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి.

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు.. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శర్వాణీ, వెస్ట్‌ బెర్రీ, కేజీబీవీ పాఠశాలలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు లభించాయి.

గిరిజనుల నృత్య ప్రదర్శన
 


శర్వాణీ పాఠశాల విద్యార్థుల ప్రదర్శనకు మొదటి బహుమతి

 


ప్రథమ స్థానం పొందిన వైద్య, ఆరోగ్య శాఖ శకటం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని