logo

‘జిల్లా కేంద్రం ప్రకటన సంప్రదాయానికి విరుద్ధం’

నరసాపురం జిల్లా కేంద్రంగా భీమవరాన్ని ప్రభుత్వం ప్రకటించడం సంప్రదాయానికి విరుద్ధమని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ మహ్మద్‌ అహ్మద్‌ షరీఫ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గ కేంద్రాలను జిల్లా కేంద్రాలుగా ప్రకటించి, నరసాపురానికి భీమవరాన్ని ప్రకటించడం ద్వారా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే ముదునూ

Published : 27 Jan 2022 06:00 IST


ఎంఏ షరీఫ్‌

నరసాపురం, గ్రామీణ, న్యూస్‌టుడే: నరసాపురం జిల్లా కేంద్రంగా భీమవరాన్ని ప్రభుత్వం ప్రకటించడం సంప్రదాయానికి విరుద్ధమని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ మహ్మద్‌ అహ్మద్‌ షరీఫ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గ కేంద్రాలను జిల్లా కేంద్రాలుగా ప్రకటించి, నరసాపురానికి భీమవరాన్ని ప్రకటించడం ద్వారా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఇక్కడి ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ఇప్పటికే వైద్య కళాశాల పాలకొల్లుకు తరలిపోయిందన్నారు. ఇప్పుడు జిల్లా కేంద్రం తరలిపోవడానికి వైకాపా నాయకుల అసమర్థతే కారణమని దుయ్యబట్టారు. ఇది చీకటి రోజుగా నరసాపురం ప్రజలు భావిస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని