logo

ఎట్టకేలకు స్వగృహ యోగం!

టిడ్కో గృహ లబ్ధిదారుల కల త్వరలోనే నెరవేరనుంది. బ్యాంకు రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ఈనెలాఖరు నుంచి ఫ్లాట్ల అప్పగింతకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా టిడ్కో గృహాల లబ్ధిదారులు 15,434 మంది ఉన్నారు. పురపాలక కమిషనర్‌, బ్యాంకు అధికారి, లబ్ధిదారు సంయుక్తంగా త్రిసభ్య ఒప్పందం చే

Published : 27 Jan 2022 06:00 IST

టిడ్కో ఇళ్ల అప్పగింతపై కసరత్తు

భీమవరంలో గృహ సముదాయం

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: టిడ్కో గృహ లబ్ధిదారుల కల త్వరలోనే నెరవేరనుంది. బ్యాంకు రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ఈనెలాఖరు నుంచి ఫ్లాట్ల అప్పగింతకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా టిడ్కో గృహాల లబ్ధిదారులు 15,434 మంది ఉన్నారు. పురపాలక కమిషనర్‌, బ్యాంకు అధికారి, లబ్ధిదారు సంయుక్తంగా త్రిసభ్య ఒప్పందం చేసుకుని రుణాలు మంజూరు చేస్తున్నారు. ‘ఎ’ కేటగిరీలో లబ్ధిదారులకు (రూ.500 చొప్పున చెల్లించిన వారు) బ్యాంకు రుణం అవసరం లేకుండా ఫ్లాట్లు కేటాయించనున్నారు. ‘బి’ కేటగిరీలో రూ.3.15 లక్షల చొప్పున, ‘సి’ కేటగిరి లబ్ధిదారులకు రూ.3.65 లక్షల చొప్పున రుణం మంజూరు చేస్తున్నారు. ఈ రుణాన్ని 240 వాయిదాల్లో లబ్ధిదారు చెల్లించాలి. ఈ ప్రక్రియను బ్యాంకుల వారీగా కొనసాగిస్తున్నారు.

కొవిడ్‌తో జాప్యం.. కొవిడ్‌ తొలి, మలి దశల్లో బాధితులకు ఆశ్రయం కల్పించేందుకు టిడ్కో గృహాలను ఉపయోగించారు. దీంతో ఫ్లాట్ల అప్పగింతలో రెండేళ్ల పాటు జాప్యం జరిగింది. మూడో దశలోనూ కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో క్వారంటైన్‌ కేంద్రాలుగా జిల్లాలో పలు ప్రాంతాల్లో కల్యాణమండపాలు, పరిశ్రమల గోదాములను అద్దెకు తీసుకునేలా అధికారులు దృష్టి సారించారు.

తొలివిడతలో 6,112 మందికి.. జిల్లాలో తొలివిడతగా భీమవరంలో 1984, పాలకొల్లులో 1856, తాడేపల్లిగూడెంలో 2272 చొప్పున మొత్తం 6,112 మంది లబ్ధిదారులకు ఫ్లాట్లను త్వరలో కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. గృహ సముదాయాల ఆవరణల్లో మౌలిక వసతులు, ఇతర సదుపాయాల కల్పనను వేగవంతం చేశామని టిడ్కో ఈఈ స్వామినాయుడు ‘న్యూస్‌టుడే’కు చెప్పారు.

లబ్ధిదారుల వివరాలు పట్టణాల వారీగా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని